Chingari App
-
సల్లూ భాయ్‌తో భాగస్వామ్యం వర్కౌట్ అవుతోందా...!
న్యూఢిల్లీ: సంక్షిప్త వీడియోల వేదిక చింగారీలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పెట్టుబడి పెట్టారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు. ఎక్కువ మంది యూజర్లను యాప్ ఆకట్టుకోవడానికి సల్మాన్‌తో భాగస్వామ్యం దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. భారత్‌కు చెందిన టెక్4బిలియన్ మీడియా ప్రమోట్ చేస్తున్న చింగారీ 2018 నవంబరులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోసహా 14 భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం గతేడాది టిక్‌టాక్‌తోసహా పలు చైనా యాప్స్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీం తో చింగారీ, రొపోసో, జోష్ వంటి దేశీయ యా ప్స్ యూజర్ల సంఖ్య అమాంతం పెరిగింది. చదవండి: ఎట్టకేలకు వారి కోరికను నెరవేర్చిన సల్మాన్ -
టిక్‌టాక్‌పై వేటు.. లోకల్ ‘జోష్’!
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌పై నిషేధంతో దేశీయ స్టార్టప్‌లకు ఊహించని అవకాశం తలుపుతట్టినట్టయింది. టిక్‌టాక్‌కు ఉన్న భారీ యూజర్లను సొంతం చేసుకునేందుకు చాలా సంస్థలు వేగంగా ఈ మార్కెట్ వైపు అడుగులు వేశాయి. షార్ట్ వీడియో మేకింగ్ యాప్‌లను (స్వల్ప కాల నిడివితో కూడిన వీడియోలను సృష్టించి ఇతర యూజర్లతో పంచుకునే వేదికలు) తీసుకురావడమే కాదు.. వీటిల్లో కొన్ని విజయాన్ని సాధించడం 2020లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామంగానే చెప్పుకోవాలి. దేశీయ వినియోగదారుల డేటా రక్షణ, దేశ భద్రతతోపాటు, చైనా ద్వంద్వ వ్యవహారశైలికి తగిన చెక్ పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం వందలాది చైనా మద్దతు కలిగిన యాప్‌లను ఈ ఏడాది నిషేధ జాబితాలో పెట్టేసింది. అందులో భాగంగానే టిక్‌టాప్‌పై జూన్‌లో వేటు పడింది. టిక్‌టాక్‌కు యూజర్లు భారీగా జత కూడుతున్న తరుణంలో ఈ నిషేధం ఆ సంస్థకు మింగుడుపడలేదు. కానీ, ఇది కొత్త వేదికలకు ప్రాణం పోసింది. డైలీహంట్‌కు చెందిన ‘జోష్’ యాప్ సహా దేశీయ షార్ట్ వీడియో యాప్‌లు 40% వాటాను ఇప్పటికే సొంతం చేసుకున్నట్టు బెంగళూరుకు చెందిన కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఓ నివేదికలో వెల్లడించింది. నాలుగు రెట్ల వృద్ధి.. 2020 జూన్‌లో నిషేధం విధించే నాటికి చైనాకు చెందిన టిక్‌టాక్ (బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్లాట్‌ఫామ్)కు 16.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. కానీ, సరిగ్గా అంతకు రెండేళ్ల క్రితం నాటికి 2018 జూన్ వరకు.. ఈ సంస్థకు 8.5 కోట్ల వినియోగదారులే ఉండడం గమనార్హం. రెండేళ్లలోనే యూజర్లను రెట్టింపు చేసుకుని వేగంగా దూసుకుపోతున్న టిక్‌టాక్‌కు బ్రేక్ పడింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికల కోసం యూజర్ల అన్వేషణ మొదలైంది. ఈ క్రమంలో జోష్, ఎమ్ఎక్స్ టకాటక్, రోపోసో, చింగారి, మోజ్ మైట్రాన్, ట్రెల్ ఇలా ఎన్నో వేదికలు పుట్టుకొచ్చాయి. షార్ట్ వీడియో మార్కెట్‌పై దిగ్గజ సంస్థలైన ఫేస్బుక్, గూగుల్ కూడా ఆశపడ్డాయి. ఫలితంగా రీల్స్ పేరుతో ఫేస్బుక్, షార్ట్స్ పేరుతో యూట్యూబ్ సంస్థలు కొత్త వేదికలను తీసుకొచ్చాయి. టిక్‌టాక్ మార్కెట్ వాటాలో 40 శాతాన్ని భారత ప్లాట్‌ఫామ్‌లు సొంతం చేసుకున్నట్టు రెడ్‌సీర్ సంస్థ తెలిపింది. ఇందులో జోష్ ముందంజలో ఉందని.. నాణ్యమైన కంటెంట్, విస్తృతమైన కంటెంట్ లైబ్రరీ జోష్ బలాలుగా పేర్కొంది. ‘‘భారత సంస్థలు ప్రతి రోజూ తాజా నాణ్యమైన సమాచారాన్ని ఆఫర్ చేయగలవు. దీంతో షార్ట్ వీడియో మార్కెట్ వచ్చే ఐదేళ్లలో నాలుగు రెట్లకు పైగా వృద్ధి చెందుతుంది’’ అని రెడ్‌సీర్ సీఈవో అనిల్ కుమార్ ప్రకటించారు. విస్తరణపై చూపు.. ఇన్‌మొబి గ్రూప్ సబ్సిడరీ సంస్థ, రొపోసో యజమాని అయిన గ్లాన్స్ ఈ వారంలోనే 145 మిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్, మిత్రిల్ క్యాపిటల్ నుంచి సమీకరించడం ద్వారా మరింత విస్తరించే ప్రణాళికలతో ఉండడం గమనార్హం. గ్లాన్స్, రోపోసో ప్లాట్ఫామ్ల్లో మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడంతోపాటు ఆర్టిïఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. రొపోసోను గ్లాన్స్ గత ఏడాది బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. ‘‘భారత్‌లో ప్రస్తుతానికి ఇంటర్నెట్ వినియోగించే వారు 60 కోట్ల మంది ఉండగా.. ఇందులో షార్ట్ వీడియో కంటెంట్‌ను 45 శాతం మంది (27 కోట్లు) వినియోగిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఇంటర్నెట్ యూజర్లు 60 కోట్ల నుంచి 97 కోట్లకు పెరగనున్నారు. స్వల్పకాల నిడివితో కూడిన కంటెంట్ మార్కెట్ 4 రెట్లు వృద్ది చెందుతుంది. ప్రస్తుతం నెలవారీగా 110 బిలియన్ నిమిషాలను వీటిపై వెచ్చిస్తుండగా.. 400–500 బిలియన్ నిమిషాలకు విస్తరిస్తుంది’’ అంటూ రెడ్‌సీర్ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. ఒకవేళ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసినట్టయితే పరిస్థితుల విషయంలో పలు ప్రశ్నలు ప్రశ్నలు మిగిలే ఉన్నాయని రెడ్‌సీర్ పేర్కొంది. -
షాక్ గురైన స్నాక్ వీడియో యూజర్లు
న్యూ ఢిల్లీ: భారత్ లో టిక్ టాక్ ని నిషేదించిన తర్వాత దాని స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిన చింగారి, మిట్రాన్, రోపోసో, ట్రెల్, స్నాక్ వీడియో వంటి యాప్ లకు మంచి ఆదరణ లభించింది. స్నాక్ వీడియో యాప్ లో షార్ట్ వీడియోస్ కోసం మంచి టూల్స్ అందుబాటులో ఉండటం వల్ల దాని డౌన్లోడ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం దేశీయ యాప్ లను డౌన్ లోడ్ పరంగా ఈ యాప్ అధిగమించింది. కానీ, తాజాగా ప్రభుత్వం నిషేదించిన 43 యాప్ ల జాబితాలో స్నాక్ వీడియో యాప్ కూడా ఉండటంతో యూజర్లు అందరు షాక్ కి గురి అయ్యారు. మంగళవారం సాయంత్రం, దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత దృష్ట్యా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో 43 మొబైల్ అప్లికేషన్లపై చర్యలు చేపట్టింది. హోంమంత్రిత్వశాఖ నేతృత్వంలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ కేంద్రం నుంచి వచ్చిన సమగ్ర నివేదికలపై చర్చించిన అనంతరం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐటీ చట్టం 69ఎ సెక్షన్ ప్రకారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ చర్యలు తీసుకుందని కేంద్రం తెలిపింది.(చదవండి: 43 చైనా యాప్‌లపై నిషేధం) స్నాక్ వీడియో డౌన్ లోడ్ పరంగా దూసుకుపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంస్థని షాక్ కి గురి చేసింది. సెన్సార్ టవర్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం, అత్యధికంగా డౌన్లోడ్ చేస్తున్న యాప్ లలో స్నాక్ వీడియో ఒకటి. టిక్‌టాక్‌ను భారతదేశంలో నిషేధించిన రోజు(జూన్ 29) నుండి ఇప్పటి వరకు 190 మిలియన్ డివైస్ లలో దీనిని డౌన్లోడ్లను చేసుకున్నారు. భారత్ లో టిక్ టాక్ నిషేధం తర్వాత స్నాక్ వీడియోకి ప్రజాదరణ బాగా పెరిగింది. స్వదేశీ యాప్(మిట్రాన్ టివి, చింగారి, ట్రెల్ మరియు రోపోసో )లను కూడా ఇది దాటేసింది. గత 30 రోజుల్లో, స్నాక్ వీడియో భారతదేశంలో 35 మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. సెన్సార్ టవర్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం చింగారి, మిట్రాన్ టీవీ, ట్రెల్ యొక్క డౌన్లోడ్ సంఖ్య మిలియన్ ల నుండి లక్షలకు పడిపోయాయి. గత 30 రోజుల్లో, చింగారి, ట్రెల్, మిట్రాన్ టీవీ లను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 8లక్షలు, 3 లక్షలు, 55,000. ఈ ఏడాది ప్రారంభంలో స్నాక్ వీడియో యాప్‌ను కుయిషౌ టెక్నాలజీ ప్రారంభించింది. ఇది చైనాకు చెందిన సంస్థ. ఈ యాప్ గ్లోబల్ ప్లాట్ఫామ్లో బైట్‌డాన్స్ యాజమాన్యంలోని ప్రముఖ టిక్‌టాక్ యాప్ కి పోటీదారుగా నిలిచింది. ఇది చాలా కాలం నుండి గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. భారత ప్రభత్వం జూన్ లో నిషేధం విధించిన జాబితాలో లేనప్పటికీ నిన్న భారత ప్రభుత్వం చేత నిషేదించబడింది. (చదవండి: పబ్జీ టోర్నీలో గెలిస్తే రూ. 6 కోట్లు!) -
త్వరలో చింగారీ యాప్‌లో మార్పులు
న్యూఢిల్లీ: దేశీ యాప్ చింగారీలో త్వరలో భారీ మార్పులు చేయబోతున్నట్లు సహవ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ సోమవారం వెల్లడించారు. యూఎక్స్, బగ్స్ నుంచి అన్ని రకాలుగా యాప్‌ను మార్పుచేయనున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. దీని కోసం టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోందని తెలిపారు. టిక్ టాక్ బ్యాన్ తర్వాత స్వదేశీ చింగారీ యాప్ డౌన్లోడ్స్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ప్లేస్టోర్‌లోకి వచ్చిన 22 రోజుల్లోనే కోటికి పైగా డౌన్లోడ్స్ జరిగాయి. (అన్నీ ఆపేయండి..) ఇంత రెస్పాన్స్‌ను తాము ఊహించలేదని సుమిత్ చెప్పారు. ప్రస్తుతం చింగారీలో వీడియోలు, ఒక నిమిషం నిడివి కలిగిన న్యూస్ బులిటెన్స్ను మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు. చింగారీతో పాటు స్వదేశీ సోషల్ మీడియా యాప్స్ రొపోసో, బోలో ఇండ్యా, మోజ్ యాప్స్ డోన్‌లోడ్స్ కూడా భారీగా పెరిగాయి. (వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్స్) -
టిక్‌టాక్ బ్యాన్.. దూసుకుపోతున్న చింగారీ
బెంగళూరు: భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59 యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు చైనీస్ యాప్స్ వాడినవారంతా ప్రత్యామ్నాయ యాప్స్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ స్థానంలో భారతదేశానికి చెందిన 'చింగారీ' యాప్ డౌన్‌లోడ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్లేస్టోర్‌లోనే కోటి డౌన్లోడ్స్ పూర్తి చేసుకోవడం విశేషం. గత పదిరోజుల్లో ఈ యాప్‌ను 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోగా.. గడిచిన 72 గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది డౌన్లోడ్ చేశారు. (దేశీ యాప్స్ హుషారు..) బెంగళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్దార్థ్ గౌతమ్ గతేడాది 'చింగారీ' యాప్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడ్ ఇన్ ఇండియా యాప్ అయిన్ ‘చింగారీ’ని డౌన్లోడ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చైనాకు చెందిన యాప్స్‌ని నిషేధించాలన్న వాదన మొదలైన దగ్గర్నుంచీ 'చింగారీ' యాప్‌కు యూజర్లు పెరిగారు. గత కొన్ని రోజులుగా సబ్స్క్రైబర్స్ 400 శాతం పెరిగారు. ఈ యాప్‌లో వీడియోలు అప్లోడ్, డౌన్లోడ్ చేయొచ్చు. స్నేహితులకు షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్‌తో చాట్ చేయడంతో పాటు కొత్త వారితో ఇంటరాక్ట్ కూడా కావొచ్చు’ అని తెలిపారు. ‘చింగారీ’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బంగ్లా, మళయాళం లాంటి భాషల్లో ఉపయోగించొచ్చు.(టిక్‌టాక్‌కు చెక్ పెట్టే ఇండియన్ యాప్) -
నిషేధిత 59 చైనీస్ యాప్స్ అవుట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనీస్ యాప్స్‌ను గూగుల్, యాపిల్ భారత్‌లోని తమ యాప్‌స్టోర్స్ నుంచి తొలగించాయి. దీంతో భారత్‌లోని మొబైల్ ఫోన్ యూజర్లకు ఇవి అందుబాటులో ఉండవు. దేశ సమగ్రతకు, భద్రతకు ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ తమ యాప్ స్టోర్ నుంచి వీటిని అందుబాటులో లేకుండా చేశాయి. తాత్కాలికంగా భారత ప్లే స్టోర్ విభాగంలో పలు యాప్స్‌ను బ్లాక్ చేసినట్లు గూగుల్ తెలిపింది. నిషేధం ఎదుర్కొంటున్న వాటిల్లో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ఇట్, ఉయ్‌చాట్, క్యామ్‌స్కానర్, మి కమ్యూనిటీ మొదలైనవి ఉన్నాయి. చట్టపరమైన చర్యల యోచన లేదు: టిక్‌టాక్ .. ప్రభుత్వ నిషేధంపై టిక్‌టాక్ స్పందించింది. దీనికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనేదీ లేదని స్పష్టం చేసింది. ‘అలాంటి ప్రణాళికలేమీ మాకు లేవు. ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారత ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు లోబడే మేం పనిచేస్తాం. యూజర్ల డేటా భద్రత, వ్యక్తిగత వివరాల గోప్యతకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తాం‘ అని టిక్‌టాక్ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, నిషేధిత యాప్స్‌లో ఒకటైన బిగో లైవ్ కూడా స్పందించింది. ‘మేం భారత ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తాం. దీనిపై చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటాం‘ అని పేర్కొంది. నియామకాల ప్రణాళికల్లో చింగారీ చైనీస్ యాప్‌లపై నిషేధంతో దేశీ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా యాప్స్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అనేక రెట్లు పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను వచ్చే కొద్ది నెలల్లో 200కి పెంచుకోవాలని యోచిస్తున్నట్లు దేశీ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ చింగారీ వెల్లడించింది. -
టిక్‌టాక్ పోయింది..'చింగారి' వచ్చేసింది
తిండి తినకుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండలేం అంటున్నారు కొందరు టిక్‌టాక్ యూజర్లు. అందుకే టిక్‌టాక్ సహా 59 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేదించడంతో ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు అయోమయంలో పడిపోయారు. ఇప్పటికే ఈ యాప్‌ను భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్నపలంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్ చేయాల్సిందే అనుకున్నారేమో వెంటనే టిక్‌టాక్ ప్రత్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్టవశాత్తూ మన భారతీయులు తయారు చేసిన 'చింగారి' యాప్ కళ్లెదుట ప్రత్యక్షమయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ యాప్‌ను లక్షమంది దాకా డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. షార్ట్ వీడియో సర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్రస్తుతం భారతీయులు మక్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాషల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వదేశీ పరిఙ్ఞానంతో రూపొందింన 'చింగారి' యాప్‌ను ప్రోత్సహించాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా సైతం చింగారి యాప్‌ను డౌన్లోడ్ చేసి దాని ప్రత్యేక ఫీచర్స్‌ను వివరించారు. స్వదేశీ పరిఙ్ఞానంతో రూపుదిద్దుకున్న చింగారి యాప్ రూపకర్తలపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. మరో విశేషం ఏంటంటే ఆనంద్ మహింద్రా ఇప్పటివరకు టిక్‌టాక్ యాప్‌ను మునుపెన్నడూ డౌన్లోడ్ చేసుకోలేదు. (ప్లేస్టోర్ నుంచి టిక్‌టాక్ తొలగింపు ) I hadn’t ever downloaded TikTok but I have just downloaded Chingari... More power to you... https://t.co/9BknBvb8j3 — anand mahindra (@anandmahindra) June 28, 2020 బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ గతేడాది చింగారి యాప్‌ను రూపొందించారు. అయితే మనోళ్లకు విదేశీ వస్తువులు, యాప్‌లపై మోజెక్కువ కాబట్టి చింగారి యాప్ ఆదరణకు నోచుకోలేదు. కానీ తాజాగా 59 చైనా యాప్‌లపై ప్రభుత్వం నిషేదం విధించడంతో చింగారి యాప్ డౌన్లోడ్స్ పెరిగాయి. ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటేసి గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. అంతేకాకుండా పలు సామాజిక ప్లాట్‌ఫామ్‌లు సైతం చింగారిలో పెట్టుబుడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రోగ్రామర్ నాయక్ తెలిపారు. 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ స్వాగతించారు. డేటా తస్కరించి గూఢచార్యానికి పాల్పడ్డ యాప్‌ను భారత్ తిరిగి తన గూటికి చేర్చింది. ఎట్టకేలకు ఈ బ్యాన్ జరిగినందుకు మకు సంతోషంగా ఉందన్నారు. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన ) -
టిక్‌టాక్‌కు చెక్ పెట్టే ఇండియన్ యాప్
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిట్రాన్ ఎన్నో రోజులు నిలబడలేదు. డౌన్లోడ్లతో దూసుకుపోతున్న ఆ యాప్‌ను గతంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ యాప్ టిక్‌టాక్‌కు పోటీగా దిగింది. ప్రస్తుతం "చింగారి" యాప్ మార్కెట్లో సెన్సేషన్‌గా మారింది. పైగా "బైకాట్ చైనా ప్రొడక్ట్స్" నినాదం తర్వాత ఈ యాప్‌కు మరింత ప్రాచుర్యం లభించింది. గడిచిన మూడు రోజుల్లోనే దీన్ని 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో "చింగారి" ట్రెండింగ్‌లో నిలిచింది. చింగారి సహ వ్యవస్థాపకుడు బిశ్వాత్మ నాయక్ మాట్లాడుతూ... "భారతీయులు ఇప్పుడు టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. అయితే మేము అందరి అంచనాలకు మించి దీన్ని రూపొందించాం. (చైనా యాప్స్‌తో ముప్పు: ఇంటెలిజెన్స్) ఈ యాప్‌ను వాడుతున్న వినియోగదారులు సంతోషం వ్యక్తం చేయడం సంతృప్తినిస్తోంద"ని తెలిపారు. కాగా ఈ ఆడియో వీడియో ప్లాట్‌ఫామ్‌ను 2019లోనే డెవలప్ చేశారు. ఇందులో కొత్త వ్యక్తులతో చాట్ చేయవచ్చు, వీడియోలు అప్లోడ్ చేయవచ్చు. వినియోగదారులే స్వంతంగా వాట్సాప్ స్టేటస్లు, వీడియోలు, ఆడియోలు కూడా రూపొందించవచ్చు. మరో ముఖ్య విషయమేంటంటే ఇందులో ఎవరి వీడియోలు వైరల్ అవుతాయో వారికి పాయింట్లు లభిస్తాయి. దీన్ని డబ్బులుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ యాప్ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మరాఠి, బంగ్లా, పంజాబీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఓ సారి చింగారి యాప్ ట్రై చేయండి. (ప్లే స్టోర్‌లో కనిపించని మిట్రాన్)