
న్యూఢిల్లీ: సంక్షిప్త వీడియోల వేదిక చింగారీలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పెట్టుబడి పెట్టారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు. ఎక్కువ మంది యూజర్లను యాప్ ఆకట్టుకోవడానికి సల్మాన్‌తో భాగస్వామ్యం దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. భారత్‌కు చెందిన టెక్4బిలియన్ మీడియా ప్రమోట్ చేస్తున్న చింగారీ 2018 నవంబరులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోసహా 14 భాషల్లో యాప్ అందుబాటులో ఉంది.
భారత ప్రభుత్వం గతేడాది టిక్‌టాక్‌తోసహా పలు చైనా యాప్స్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీం తో చింగారీ, రొపోసో, జోష్ వంటి దేశీయ యా ప్స్ యూజర్ల సంఖ్య అమాంతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment