న్యూఢిల్లీ: దేశీ యాప్ చింగారీలో త్వరలో భారీ మార్పులు చేయబోతున్నట్లు సహవ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ సోమవారం వెల్లడించారు. యూఎక్స్, బగ్స్ నుంచి అన్ని రకాలుగా యాప్‌ను మార్పుచేయనున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. దీని కోసం టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోందని తెలిపారు. టిక్ టాక్ బ్యాన్ తర్వాత స్వదేశీ చింగారీ యాప్ డౌన్లోడ్స్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ప్లేస్టోర్‌లోకి వచ్చిన 22 రోజుల్లోనే కోటికి పైగా డౌన్లోడ్స్ జరిగాయి. (అన్నీ ఆపేయండి..)
ఇంత రెస్పాన్స్‌ను తాము ఊహించలేదని సుమిత్ చెప్పారు. ప్రస్తుతం చింగారీలో వీడియోలు, ఒక నిమిషం నిడివి కలిగిన న్యూస్ బులిటెన్స్ను మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు. చింగారీతో పాటు స్వదేశీ సోషల్ మీడియా యాప్స్ రొపోసో, బోలో ఇండ్యా, మోజ్ యాప్స్ డోన్లోడ్స్ కూడా భారీగా పెరిగాయి. (వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్స్)
Comments
Please login to add a commentAdd a comment