న్యూఢిల్లీ: టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిట్రాన్ ఎన్నో రోజులు నిలబడలేదు. డౌన్‌లోడ్లతో దూసుకుపోతున్న ఆ యాప్‌ను గతంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ యాప్ టిక్‌టాక్‌కు పోటీగా దిగింది. ప్రస్తుతం "చింగారి" యాప్ మార్కెట్లో సెన్సేషన్‌గా మారింది. పైగా "బైకాట్ చైనా ప్రొడక్ట్స్" నినాదం తర్వాత ఈ యాప్‌కు మరింత ప్రాచుర్యం లభించింది. గడిచిన మూడు రోజుల్లోనే దీన్ని 5 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో "చింగారి" ట్రెండింగ్‌లో నిలిచింది. చింగారి సహ వ్యవస్థాపకుడు బిశ్వాత్మ నాయక్ మాట్లాడుతూ... "భారతీయులు ఇప్పుడు టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. అయితే మేము అందరి అంచనాలకు మించి దీన్ని రూపొందించాం. (చైనా యాప్స్‌తో ముప్పు: ఇంటెలిజెన్స్)
ఈ యాప్‌ను వాడుతున్న వినియోగదారులు సంతోషం వ్యక్తం చేయడం సంతృప్తినిస్తోంద"ని తెలిపారు. కాగా ఈ ఆడియో వీడియో ప్లాట్‌ఫామ్‌ను 2019లోనే డెవలప్ చేశారు. ఇందులో కొత్త వ్యక్తులతో చాట్ చేయవచ్చు, వీడియోలు అప్‌లోడ్ చేయవచ్చు. వినియోగదారులే స్వంతంగా వాట్సాప్ స్టేటస్‌లు, వీడియోలు, ఆడియోలు కూడా రూపొందించవచ్చు. మరో ముఖ్య విషయమేంటంటే ఇందులో ఎవరి వీడియోలు వైరల్ అవుతాయో వారికి పాయింట్లు లభిస్తాయి. దీన్ని డబ్బులుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ యాప్ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మరాఠి, బంగ్లా, పంజాబీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఓ సారి చింగారి యాప్ ట్రై చేయండి. (ప్లే స్టోర్‌లో కనిపించని మిట్రాన్)
Comments
Please login to add a commentAdd a comment