న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్‌టాక్ ఇండియాలో తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. యాప్‌పై భారత ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించిన నేపథ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్.. తమ ఉద్యోగులకు బుధవారం ఓ మెమో జారీ చేసింది. "యాప్‌పై నిషేధం కొంతకాలానికే పరిమితమవుతుందని తాము భావించామని, కానీ అలా జరగలేదని" ఆ సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నది. యాప్ ఇక్కడ పని చేయకుండా అందరు ఉద్యోగులను కొనసాగిస్తూ ఉండలేము అని పేర్కొంది. ఇండియాలో భవిష్యత్ లో తిరిగి రావడానికి ప్రయత్నిస్తామని బైట్‌డ్యాన్స్ ఆ మెమోలో పేర్కొన్నది. (చదవండి: రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?)
నిషేదానికి ముందు టిక్‌టాక్ కు భారతదేశం అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్. ఇండియాలోనే 200 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టీవ్ యూజర్లను సంపాదించింది. చైనా, భారత్ దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో చైనాకు చెందిన 267పైగా యాప్‌లను గత ఏడాది వివిధ దశలలో నిషేదించింది. ఇందులో టిక్‌టాక్ కూడా ఉంది. గోప్యత, జాతీయ భద్రతా రక్షణ కారణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్‌లను నిషేధించినట్లు కేంద్రం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment