ఢిల్లీ : టిక్‌టాక్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పబ్జీపై భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం విధించనుంది. దీనితో పాటే అలీ ఎక్స్‌ప్రెస్, లూడో సహా చైనాకు చెందిన 275 యాప్‌లపై భారత్ నిషేదం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గాల్వన్ లోయల్ భారత్-చైనా మధ్య ఉద్రిక్తలు నెలకొన్నప్పటి నుంచి చైనాకు చెందిన యాప్‌లపై ప్రత్యేక దృష్టి సారించిన నిఘా వర్గాలు ఇప్పటికే టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 యాప్‌లను నిషేదించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ భద్రతకు ముప్పు కలిగేంచాలా మరో 275 చైనా యాప్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. (సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్! )
నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరణకు గురవుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు. ఈ యాప్ బ్యాన్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. చైనాకు చెందిన అన్నిటెక్ కంపెనీలు.. ప్రభుత్వం ఏ సమాచారాన్ని కోరానా ఇవ్వాల్సిందిగా 2017 నాటి చట్టంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్, సహా వివిధ దేశ వినియోగదారుల డేటాపై డ్రాగన్ నియంత్రణ ఉండే ఆస్కారం ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే దీనిపై భారత్‌ను అనుసరించి చైనా యాప్‌లను నిషేదించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. (ముదిరిన దౌత్య యుద్ధం: కీలక పరిణామం)
Comments
Please login to add a commentAdd a comment