న్యూఢిల్లీ : చైనీస్ యాప్‌లకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారత్‌లో 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రభుత్వం నిషేధం విధించిన వాటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హలో, వీ చాట్, బ్యూటీ ప్లస్ యాప్స్ కూడా ఉన్నాయి. దేశ రక్షణ, భద్రత దృష్ట్యా చైనా యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, చైనీస్ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధం విధించాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 52 చైనా యాప్స్‌ను నిషేధించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని కోరాయి.(చదవండి : ‘చైనా, పాక్ కుట్రను అప్పట్లోనే బయటపెట్టారు’)
నిషేధం విదించిన యాప్‌ల జాబితా..
Comments
Please login to add a commentAdd a comment