సాక్షి,హైదరాబాద్: రేవంత్,అదానీ వ్యవహారంపై ఎండగట్టేందుకు అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా సోమవారం(డిసెంబర్ 9) కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
టీ షర్ట్స్ ధరించి అసెంబ్లీ లోపలికి రావొద్దన్న కారణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారన్నారు. హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు.తెలంగాణ వనరులను అదానీకి దోచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్,అదానీల చీకటి ఒప్పందాలపై రాహుల్ గాంధీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలు,దాడులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్ నేతల టీ షర్ట్స్‌పై రేవంత్ ఫొటో.. తీవ్ర ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment