సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు.. అదానీ-రేవంత్ ఉన్న ఫొటోతో టీ షర్టులు వేసుకుని వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారంతా రేవంత్, అదానీలు కలిసి ఉన్న ఫొటోలతో టీ షర్టీలు ధరించి అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు నెంబర్-2 వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీ షర్టులు ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పోలీసులు, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వదం జరిగింది. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తుతాం. రేవంత్-అదానీ ఒక్కటై తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడుతాం. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగడతాం.
అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్-అదానీ టీషర్టు వేసుకుని సభలోకి వస్తే ఇబ్బందేంటి?. ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా?. అదానీ, రేవంత్ రెడ్డి భాయ్, భాయ్. అరెస్ట్ చేసి, గొంతు నొక్కి మమ్మల్ని ఆపలేరు.
Comments
Please login to add a commentAdd a comment