స్టార్ హీరోయిన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అందం, అభినయం, ఫిట్నెస్తో సినీ ప్రేక్షకుల్నీ అలరిస్తోంది. సమంత ఉంటే సినిమాకు మంచి ఫలితమే దక్కుతుందని దర్శకనిర్మాతలు ఆమె వెంట క్యూ కడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల వంటి ప్రాజెక్టులతో సామ్ ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫిట్నెస్, మోటివేషనల్ పోస్ట్‌తో యాక్టివ్‌గా ఉంటుంది. సమంతకు ఫిట్నెస్తో పాటు డ్రెస్సింగ్ స్టైల్‌పై కూడా ప్రత్యేక అవగాహన ఉంది. విభిన్నమైన డ్రైస్సింగ్ స్టైల్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది సామ్.
తాజాగా సమంత ముంబైలోని ఓ సెలూన్ నుంచి బయటకు వస్తూ కెమెరా కళ్లకు చిక్కింది. ప్రస్తుతం ఆ ఫొటోల్లో సమంత వేసుకున్న వైట్ టీ షర్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా సామ్ వేసుకున్న టీ షర్ట్ ఖరీదు గురించి. ఎందుకంటే సామ్ వేసుకున్న ఆ 'ఆర్13 వైట్ టీ షర్ట్' ధర సుమారు రూ. 17,000 ఉంటుందట. వైట్ రిప్డ్ టీతో జత చేసిన బేసిక్ బ్లాక్ జీన్స్, వైట్ స్పోర్ట్స్ షూలు ధరించి మాస్క్ పెట్టుకుని ఆకట్టుకుంది సామ్ లుక్. త్వరలో ఈ స్టైల్‌ను ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి మరీ.
Comments
Please login to add a commentAdd a comment