
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు-2018’కి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ ‘ది ఎర్త్ టీ’ అనే టీ షర్ట్‌ని విడుదల చేసింది. తన ‘ఫ్యాషన్ ఫర్ ఎర్త్’ కార్యక్రమంలో భాగంగా లాక్మే ఫ్యాషన్ వీక్‌తో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ టీ షర్ట్‌ని ప్రముఖ డిజైనర్ అనిత డోంగ్రే డిజైన్ చేశారు. ఫ్యాషన్ అంటే ప్రకృతిని, పర్యావరణాన్ని పణంగా పెట్టడం కాదనీ, పర్యావరణ హితం కోరుతూ పనిచేయడం కూడా అనే నినాదంతో రిలయన్స్ ఇండస్ర్టీస్ జనవరిలో ఫ్యాషన్ ఫర్ ఎర్త్ కార్యక్రమాన్ని చేపట్టింది. ముంబైలోని జియో గార్డెన్‌లో జరిగిన నాటి కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మందికి అందించిన తాగు నీటి సీసాలను రీయూజ్ కోసం ఆర్‌ఐఎల్ స్వయంగా సేకరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment