Parliament: నినాదాల టీ షర్టుతో ఎంపీ.. స్పీకర్‌ ఆగ్రహం | Opposition MP Reached Lok Sabha Wearing T-Shirts With Slogans, Om Birla Angry | Sakshi
Sakshi News home page

Parliament: నినాదాల టీ షర్టుతో ఎంపీ.. స్పీకర్‌ ఆగ్రహం

Published Thu, Mar 20 2025 1:08 PM | Last Updated on Thu, Mar 20 2025 1:16 PM

Opposition MP Reached Lok Sabha Wearing T-Shirts With Slogans, Om Birla Angry

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు(Budget sessions of Parliament) అధికార, ‍ప్రతిపక్షాల వాదప్రతివాదనల మధ్య కొనసాగుతున్నాయి. ఈ రోజు(గురువారం) లోక్‌సభలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. డీఎంకే ఎంపీ టీ శివ నినాదాలు రాసిన టీ-షర్టు ధరించి, పార్లమెంటకు వచ్చారు. దీనిని చూసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నినాదాలతో కూడిన టీ షర్టులు(T-shirts) ధరించి రావద్దని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరారు. ఈ నేపధ్యంలో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈరోజు సభా కార్యకలాపాలు ప్రారంభానికి ముందు డీఎంకే ఎంపీ టి శివ ‘న్యాయమైన డీలిమిటేషన్ కోసం తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది’ అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు న్యాయమైన డీలిమిటేషన్ కోసం పట్టుబడుతోందని, ఇది దాదాపు ఏడు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని,  కానీ ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. అందుకే న్యాయమైన డీలిమిటేషన్ డిమాండ్ చేస్తూ మేము మా నిరసనను కొనసాగిస్తున్నామని అన్నారు.
 

లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే  స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి ‘సభ మర్యాద పూర్వకంగా, గౌరవంగా నడవాలని అన్నారు. సభ్యులు సభ గౌరవాన్ని ఉల్లంఘిస్తున్నారని, సభ నియమాలు, విధానాలను పాటించడం లేదని, ఈ విషయాన్ని తాను  కొన్ని రోజులుగా గమనిస్తున్నానన్నారు. సభ్యులంతా నియమం నంబర్ 349 చదవాలని కోరారు. సభ ప్రతిష్టను కాపాడేందుకు ఎలా ప్రవర్తించాలనేది దానిలో రాసివుందున్నారు.

నినాదాలు రాసివున్న టీ-షర్టులు ధరించి, ఇక్కడికి (సభలోకి) వస్తే, లేదా నినాదాలు చేస్తే సభా కార్యకలాపాలు నిర్వహించలేమన్నారు.  ఎవరైనా సరే సభా మర్యాదలను, సంప్రదాయాలను ఉల్లంఘిస్తే, లోక్‌సభ స్పీకర్‌గా చర్య తీసుకోవడం తన బాధ్యత అని అన్నారు. అనంతరం ఆయన తన సీటు నుండి లేచి సభా కార్యకలాపాలు కొనసాగకూడదనుకుంటే బయటకు వెళ్లిపోవాలని ప్రతిపక్ష సభ్యులకు చెప్పారు. అనంతరం ఆయన సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

ఇది ​కూడా చదవండి: Bihar: ‘టైగర్‌ జిందా హై’.. రబ్రీ ఇంటి ముందు హోర్డింగ్‌ కలకలం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement