పాట్నా: బీహార్ విద్యాశాఖ జీన్స్, టీషర్ట్ పై నిషేధాన్ని విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది జీన్స్, టీషర్ట్ ధరించటంపై నిషేధాన్ని విధించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. వివరాల ప్రకారం.. విద్యాశాఖ కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది జీన్స్, టీషర్ట్ వంటి క్యాజుబల్స్ ధరించి రాకూడదని ఆదేశించింది.
‘ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లుగా దుస్తులు ధరించి ఆఫీసుకు వస్తున్నారు.ఇటువంటి దుస్తులు ధరించి రావటంవల్ల కార్యాలయాల సంస్కృతి దెబ్బతింటోందని’ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇలాంటి దుస్తులు ధరించడం పనిచేసే సంస్కృతికి విరుద్ధమని తెలిపారు. కాబట్టి అధికారులు, ఉద్యోగులందరూ విద్యా శాఖ కార్యాలయాలకు అధికారిక దుస్తులలో మాత్రమే రావాలి. విద్యా శాఖ కార్యాలయాల్లో ఫ్యాషన్ ట్రెండీ వంటి దుస్తులు, ముఖ్యంగా జీన్స్, టీ-షర్టులు బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది.
ముఖ్యంగా, సరన్ జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ ఏప్రిల్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆదేశాలను తప్పక పాటించాలని కోరింది. ఫార్మల్ డ్రెస్‌లు ధరించాలని, గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలని పేర్కొంది. కాగా బీహార్ ప్రభుత్వం, 2019లో, రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ర్యాంక్‌లతో సంబంధం లేకుండా జీన్స్, టీ-షర్టులు ధరించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. లైట్ కలర్ లో ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలని ఉద్యోగులను ఆదేశించింది.
చదవండి: అక్కడకు రాగానే రైళ్లలో లైట్లు బంద్.. విచిత్రమో, విడ్డూరమో కాదు!
Comments
Please login to add a commentAdd a comment