బీహార్ ప్రభుత్వ విద్యాశాఖ తాజాగా సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అదే సమయంలో ఈద్-బక్రీద్‌కు మూడు రోజులు, ముహర్రం కోసం రెండు రోజుల చొప్పున సెలవులు కేటాయించారు.
ఉపాధ్యాయులకు వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. విద్యార్థులకు యథావిధిగా వేసవి సెలవులు ఉంటాయి. కొత్త సెలవుల పట్టిక ప్రకారం 60 రోజుల సెలవుల్లో 38 రోజులు ఉపాధ్యాయులు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయులకు 22 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. మే ఒకటిన కార్మిక దినోత్సవం సెలవు కూడా రద్దు చేశారు.
ప్రత్యేక రోజులలోనూ పాఠశాలలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజులలో భోజన వేళకు ముందు ఆ ప్రత్యేకదినానికి సంబంధించిన విషయాలు విద్యార్థులకు తెలియజేయాల్సివుంటుంది. హిందూ పండుగలలో సెలవులు రద్దు చేయడంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు!
"तुष्टिकरण के सरदार-बिहार के कुर्सी कुमार"
— Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) November 27, 2023
एकबार फिर चाचा-भतीजे की सरकार का हिंदू विरोधी चेहरा सामने आया। एक तरफ स्कूलों में मुस्लिम पर्व की छुट्टी बढ़ाई जा रही हैं,वहीं हिंदु त्योहारों में छुट्टियां खत्म की जा रही हैं।
लानत है वोटबैंक के लिए सनातन से घृणा करने वाली सरकार को। pic.twitter.com/3yX6WAeGnx
Comments
Please login to add a commentAdd a comment