leave cancel
-
జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి సెలవులు రద్దు!
బీహార్ ప్రభుత్వ విద్యాశాఖ తాజాగా సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అదే సమయంలో ఈద్-బక్రీద్‌కు మూడు రోజులు, ముహర్రం కోసం రెండు రోజుల చొప్పున సెలవులు కేటాయించారు. ఉపాధ్యాయులకు వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. విద్యార్థులకు యథావిధిగా వేసవి సెలవులు ఉంటాయి. కొత్త సెలవుల పట్టిక ప్రకారం 60 రోజుల సెలవుల్లో 38 రోజులు ఉపాధ్యాయులు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయులకు 22 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. మే ఒకటిన కార్మిక దినోత్సవం సెలవు కూడా రద్దు చేశారు. ప్రత్యేక రోజులలోనూ పాఠశాలలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజులలో భోజన వేళకు ముందు ఆ ప్రత్యేకదినానికి సంబంధించిన విషయాలు విద్యార్థులకు తెలియజేయాల్సివుంటుంది. హిందూ పండుగలలో సెలవులు రద్దు చేయడంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు! "तुष्टिकरण के सरदार-बिहार के कुर्सी कुमार" एकबार फिर चाचा-भतीजे की सरकार का हिंदू विरोधी चेहरा सामने आया। एक तरफ स्कूलों में मुस्लिम पर्व की छुट्टी बढ़ाई जा रही हैं,वहीं हिंदु त्योहारों में छुट्टियां खत्म की जा रही हैं। लानत है वोटबैंक के लिए सनातन से घृणा करने वाली सरकार को। pic.twitter.com/3yX6WAeGnx — Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) November 27, 2023 -
పోలీస్‌కు సెలవు దొరకలేదు.. చివరికి స్టేషన్లోనే..
న్యూఢిల్లీ: కరనా మహమ్మారి కారణంగా ప్రజలు ఇప్పటికే సామాజిక దూరం, లాక్డౌన్ అంటూ ఆంక్షలతో సాధారణ జీవితాన్ని దూరమైయ్యారు. ఇక అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే కొన్ని ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులు రాత్రి పగలు అన్నతేడా లేకుండా నిరంతరం కరోనాను కట్టడి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌కు సెలవు మంజూరు కాకపోవడంతో తాను పని చేసే పోలీస్ స్టేషన్లోనే పెళ్లికి ముందు జరిగే ‘పసుపు ఫంక్షన్’ వేడుకను జరుపుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని దుంగార్పూర్లో చోటు చేసుకుంది. వివరాలు.. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా అత్యవసర సేవల కింద పని చేసే ఉద్యోగుల సెలవులను తాత్కాలికంగా మంజూరు చేయడం లేదు. రాజస్తాన్‌లోని దుంగార్పూర్ పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్ పెళ్లి కుదిరింది. అయితే పెళ్లికి ముందు జరిగే పసుపు వేడుక కోసం సెలవు దొరక్క పోయేసరికి కానిస్టేబుల్ పని చేస్తున్న స్టేషన్ ముందే ఆమె తోటి ఉద్యోగులు స్టేషన్ బయటే ఈ తతంగాన్ని జరిపించారు. వారు సాంప్రదాయ ప్రకారం రాజస్థానీ పాటలు పాడుతూ పెళ్లి కాబోయే వధువుకు పసుపు పూస్తూ సాధారణంగా ఈ కార్యక్రయం ఎలా జరుగుతోందో అదే విధంగా జరిపించారు. కాగా, కరోనా సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ కంటే బలంగా, అలాగే దానీ ప్రభావం తీవ్రత కూడా ఎక్కువగానే చూపిస్తోంది. దీంతో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై, పోలీసులతో పాటు ఫ్రంట్‌లైన్ కార్మికులపై పని ఒత్తిడి తీవ్రంగానే పెరిగిందని చెప్పాలి. కేసులను పెరుగుదల కట్టడి కోసం శుక్రవారం రాజస్తాన్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. శుక్రవారం ఒక్క రోజే 64 మరణాలతో 15,398 తాజా కేసులు రాజస్తాన్‌లో నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 4,83,273 కోవిడ్ కేసులు కాగా, మరణాల సంఖ్య 3,453 కు చేరుకుంది. ( చదవండి: ఆడపిల్ల పుట్టిందని.. హెలికాఫ్టర్ బుక్ చేశాడు..ఎందుకంటే! ) Rajasthan: 'Haldi' ceremony of a woman police constable who is posted at Dungarpur police station was held at station premises, as couldn't avail leave amid surge in COVID19 cases. (23/4) pic.twitter.com/S1KoKc99yB — ANI (@ANI) April 24, 2021 -
ఓటేయండి, సాక్ష్యం చూపండి లేదంటే.. సెలవు కట్
పాలికె, అసెంబ్లీ, లోక్‌సభ.. ఇలా ఏ ఎన్నికలు వచ్చినా ఉద్యాననగరిలో ఐటీ, బీటీ తదితర అనేక సంస్థల ఉద్యోగులకు సెలవే. అయితే అనేకమంది పోలింగ్ కేంద్రాలకు కాకుండా విహార యాత్రలకు వెళ్తున్నారని ఫిర్యాదులు రావడంతో కంపెనీలు నివారణ చర్యలు చేపట్టాయి. బనశంకరి: రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనకుండా సెలవును గడిపే ఐటీ కంపెనీ ఉద్యోగులను యాజమాన్యాలు కట్టడి చేయబోతున్నాయి. ఈ నెల 18 తేదీన బెంగళూరులో జరిగే పోలింగ్ రోజున కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుని, ఆ ఆధారాలను హెచ్ఆర్ విభాగంలో సమర్పించాలి. అప్పుడే వేతన సమేత సెలవు లభిస్తుంది. లేనిపక్షంలో ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి పలు చర్యలు చేపడుతోంది. ప్రతి ఎన్నికల్లోనే విద్యావంత ఓటర్లు పోలింగ్ రోజున ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారని, గ్రామీణ ప్రదేశాల కంటే నగరాల్లో పోలింగ్‌శాతం తక్కువగా నమోదు కావడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నగరంలోని ఐటీ, బీటీ కంపెనీలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులను ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు తప్పనిసరిగా ఓటు వేయాలని తమ ఉద్యోగులను ఆదేశించాయి. వేతన సెలవు పక్కదారి ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారు. ఈ సెలవును ఉద్యోగులు విశ్రాంతికి, విహార యాత్రలకు మార్చుకుంటున్నారని ఆరోపణలున్నాయి. అంతే తప్ప బాధ్యతగా ఓటు వేయడం లేదు. దీనిని నివారించడానికి యజమాన్యాలు తమ ఉద్యోగులకు వేతన సమేతంగా సెలవు కావాలంటే ఓటింగ్‌లో పాల్గొన్నట్లు పూర్తి ఆధారాలు అందజేయాలి. లేని పక్షంలో ఆ రోజు సెలవు రద్దు చేస్తామని చెబుతున్నాయి. ఇన్పోసిస్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు సందేశం పంపినట్లు సమాచారం. -
అకున్ సబర్వాల్ అనూహ్య నిర్ణయం!