ధర్మపురి అరవింద్‌కు షాక్‌.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ | Jagtial Bjp Workers Protest Infront Of Telangana Bjp Office | Sakshi
Sakshi News home page

ధర్మపురి అరవింద్‌కు టికెట్‌ ఇస్తే ఓడిస్తాం: బీజేపీ కార్యకర్తలు

Published Fri, Feb 9 2024 3:48 PM | Last Updated on Fri, Feb 9 2024 4:08 PM

Jagtial Bjp Workers Protest Infront Of Telangana Bjp Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్‌కు  టికెట్ ఇవ్వద్దని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు జగిత్యాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిలో సతీష్‌ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఈసారి అరవిం‍ద్‌కు టికెట్‌ ఇవ్వద్దని కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ‘వి వాంట్‌ జస్టిస్‌, అహంకార అరవింద్ మాకొద్దు.. అరవింద్ డౌన్ డౌన్ , అరవింద్‌ కీ హటావో బీజేపీ బచావో’ అంటూ మెడలో దండలు, ప్ల కార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తలు ఆందోళన చేశారు.  

‘ఎంపీగా గెలిచిన అరవింద్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు. గత 30 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పట్టించుకోవడం లేదు. ఈసారి అరవింద్‌కు టికెట్ ఇస్తే ఒడిస్తాం’ అని కార్యకర్తలు స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి.. కాంగ్రెస్‌ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement