న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు సరఫరా చేసే దుర్గంధపూరిత నీరు తాగాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ప్రధాని మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ కూడా తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. హౌజ్ కాజీ చౌక్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.
2020 అల్లర్ల బాధితులను తరఫున తనతోపాటు తన పార్టీ మాత్రమే మద్దతుగా నిలిచిందని, అణచివేతకు గురయ్యే వారికి ఇకపైనా దన్నుగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రేమ, సోదరభావాన్ని పంచే కాంగ్రెస్ కావాలో విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే బీజేపీ కావాలో తేల్చుకోవాలని ప్రజలను ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment