Kannada Actor Shankanada Aravind Dies Of COVID-19 And Daughter Writes Emotional Note - Sakshi
Sakshi News home page

Shankanada Aravind: ప్రముఖ కన్నడ నటుడు మృతి

Published Sat, May 8 2021 8:47 AM | Last Updated on Sat, May 8 2021 11:07 AM

Kannada Actor Shankanada Aravind  Dies Due To  COVID-19 - Sakshi

యశవంతపుర: ప్రముఖ కన్నడ నటుడు శంకనాడ అరవింద్(70) కన్నుమూశారు. కరోనాతో వారం రోజుల క్రితం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కూతురు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మనసా హోల్లా తన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కొన్నాళ్లు క్రితమే తల్లి చనిపోయిందని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయామని ఎమోషనల్‌ అయ్యింది.

అరవింద్‌ భార్య రమ ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోయారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నటుడు అరవింద్‌ అనుభ, అగుంటక, బెట్టాడ హూవు, అపరిచిత, శంకనాడ, జ్ఞాన గంగే వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. సహాయక పాత్రల్లో తనదైన మార్కును చూపించేవారు. శంకనాడ చిత్రంలో శంఖం బ్లోవర్ పాత్రతో ఎంతో ప్రజాదరణ పొందారు. అరవింద్‌ ఇప్పటివరకు సుమారు 250 సినిమాల్లో నటించారు. 

చదవండి : 
టాలీవుడ్‌లో అవకాశాల కోసం చూస్తున్న రియా చక్రవర్తి


చోటా రాజన్ మృతిపై రూమర్స్.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement