
అరవింద్ మృతదేహం లభ్యం
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్లో గల్లంతైన హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అరవింద్ కుమార్ మృతదేహం లభ్యమైంది. సహాయక సిబ్బంది గురువారం ఉదయం మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. అరవింద్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. కుమారుడి మరణవార్తతో అతని తల్లి శశిలత రోదన వర్ణనాతీతంగా ఉంది.
తన కుమారుడు ఇంకా సజీవంగా తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న ఆమెకు అరవింద్ మృతదేహం లభ్యం కావటంతో కోలుకోలేని విషాదంలో మునిగిపోయారు. అరవింద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో చదువుతున్న విషయం తెలిసిందే. అతని మృతదేహం లభ్యం కావటంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు గల్లంతు అయిన 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు.