బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్‌ | Arvinder Lovely Who Quit As Delhi Congress Chief Rejoins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్‌

Published Sat, May 4 2024 5:22 PM | Last Updated on Sat, May 4 2024 5:58 PM

Arvinder Lovely Who Quit As Delhi Congress Chief Rejoins BJP

Arvinder Lovely, Who Quit As Delhi Congress Chief Twice, Rejoins BJP

లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.  ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ తాజాగా బీజేపీలో చేరారు. 

శనివారం కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ, బీజేపీ జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తావ్డే, ఢిల్లీ పార్టీ చాఫ్‌ వీరేంద్ర సచ్‌దేవా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకన్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా  ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో తీవ్ర అసహనానికి గురైన  అరవిందర్‌ ఇటీవల ఢిల్లీ చీఫ్‌ పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన పుకార్లను కొట్టిపారేశాడు. అయితే నిన్నటి మొన్నటి వరకు కూడా బీజేపీలో చేరడం లేదని తెలిపిన ఆయన..నేడు కాషాయ కండువా కంపుకోవడం ఆసక్తికరంగా మారింది.

బీజేపీలో చేరిన తర్వాత లవ్లీ మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజల తరుపున పోరాడే అవకాశం లభించిందని, దేశంలో అఖండ మెజారిటీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, రానున్న రోజుల్లో ఢిల్లీలోనూ బీజేపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు.

అయితే 2015లోనే అరవిందర్‌ ఢిల్లీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. 2017లో బీజేపీలో చేరిన ఆయన కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు.  ప్రస్తుతం మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement