
సాక్షి, హైదరాబాద్ : క్యూనెట్ చేతిలో మోసపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీకాకుళంకు చెందిన అరవింద్ నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. గతంలో అరవింద్ క్యూనెట్‌లో 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. చాలాసార్లు తన డబ్బులు తనకు వెనక్కి వెళ్లాలని అడిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన అరవింద్ మంగళవారం రాత్రి మాదాపూర్‌లో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూసెట్ సంస్థల కొన్ని లక్షల మందిని మోసం చేసింది. ఐటీ కారిడార్లైన ముంబై, బెంగళూర్, నోయిడా, అహ్మదాబాద్ లాంటి అనేక నగరాల్లో క్యూ నెట్ సంస్థ కోట్లు వసూలు చేసింది. బిజినెస్ ప్లాన్ ఉందని అమాయక, నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తూ ముగ్గులోకి దింపి కోట్ల రూపాయలు దంచుకున్నారు. కూనెట్ మోసాలపై సైబరాబాద్ కమిషనరేట్లో పలు సంఖ్యల్లో కేసులు నమోదయ్యాయి.
(చదవండి : క్యూనెట్ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!)
Comments
Please login to add a commentAdd a comment