QNet Scam
-
క్యూ నెట్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
-
Qnet Case: క్యూనెట్ కేసులో కీలక నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం) క్యూనెట్ కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా, చిన్నంపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ ఉపేంద్ర నాథ్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నా రు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (క్యూనెట్)పై మహంకాళి పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమో దయ్యాయి. అనంతరం అదనపు సీపీ(ఎస్ఐటీ) ఆదేశాల మేరకు ఈ కేసుల ను హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వి–అంపైర్ పేరుతో నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో గుర్తించిన అధికారులు 15 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. వీరు అధిక లాభాలు ఆశ చూపించి నిరుద్యోగులు, గ్రామీణులు, అమాయకుల నుంచి డబ్బులు సేకరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ప్రధా న నిందితులు రాజేష్‌ఖన్నా, సీహెచ్ ఉపేంద్రనాథ్‌రెడ్డి ప్రేరణ క్లాసులు నిర్వహించి సామాన్యులను మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో పెట్టుబడులను ఆకర్శించేవారు, ఈ క్రమంలో పెట్టుబడుల పెట్టిన వారికి నెలకు రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపారు. రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కో బాధితుడి నుంచి రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు చార్జీల రూపంలో వసూలు చేశారు. ఇదే తరహాలో దాదాపు 163 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్లకు చెందిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్ల నగదును సీజ్ చేసిన పోలీసులు ఇప్పటివరకు 15 మంది నిందితుల్లో 9 మందిని అరెస్ట్ చేశారు. -
క్యూనెట్ స్కాంపై ఈడీ కొరడా.. రూ.137 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: క్యూనెట్ స్కాంకు సంబంధించి వీహాన్ డెరెక్ట్ సెల్లింగ్ సంస్థపై ఈడీ కొరడా ఝులిపించింది. ఈ కంపెనికీ చెందిన రూ.137కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరులోని 8 భవనాలను జప్తు చేసింది. సైబరాబాద్‌లో నమోదైన కేసు విచారణలో భాగంగా ఈమేరకు హైదరాబాద్ విభాగం ఈడీ చర్యలు తీసుకుంది. 58 బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా క్యూనెట్‌పై మొత్తం 38 చోట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ 9 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంది. చదవండి: పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్! -
స్వప్నలోక్ ప్రమాదం.. ‘క్యూ–నెట్’పై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని క్యూ–నెట్ సంస్థ చీకటి దందా మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురు యువతీయువకులూ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న ఈ సంస్థ ఉద్యోగులే. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన మర్నాటి నుంచి దీనిపై పోలీసులు దృష్టి పెట్టారు. మాదసి నవీన్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులో ఉన్న క్యూ–నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయం కొనసాగుతోంది. ‘వి–ఎంపైర్’పేరుతోనూ కొనసాగుతున్న ఈ సంస్థలో అనేక మంది పని చేస్తున్నారు. ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించడం పేరుతో క్యూ–నెట్ సంస్థ మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్స్కు తెరలేపడంపై గతంలో సీఐడీ సహా అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దాంతో కొన్నాళ్లు మిన్నకుండిపోయిన ఈ సంస్థ ఇటీవలే మళ్లీ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. వెస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతంలో నివసిస్తున్న వరంగల్ వాసి మాదసి నవీన్, స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన బానోత్ శ్రావణి స్నేహితులు. శ్రావణి ద్వారానే నవీన్‌కు ‘వి–ఎంపైర్’సంస్థ కార్యకలాపాలు తెలిశాయి. తమ సంస్థలో చేరితే ప్రతి నెలా రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు ఆర్జించవచ్చని ఆమె చెప్పడంతో నవీన్ గతేడాది ఆక్టోబర్‌లో ‘వి–ఎంపైర్’లో చేరాడు. రూ.1.6 లక్షలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న అతనికి ఇద్దరు సభ్యులను చేరిస్తే కమీషన్ల రూపంలో నగదు వస్తుందని సూచించారు. కానీ ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఈ సంస్థలో చేరాకే నవీన్‌కు వి–ఎంపైర్ అన్నది మలేసియాకు చెందిన క్యూ–నెట్లో భాగమని తెలిసింది. ఇక్కడ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి కార్యకలాపాలు సాగిస్తోందని తెలుసుకున్నాడు. నిషిద్ధ మనీ సర్క్యులేషన్, మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాలు చేస్తున్న ఈ సంస్థను బెంగళూరుకు చెందిన రాజేష్ ఖన్న నిర్వహిస్తున్నాడని నవీన్ గుర్తించాడు. -
క్యూనెట్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. ఎంఎల్ఎం మోసాలపై సజ్జనార్ ట్వీట్
అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వలలో చిక్కుకోవద్దని, అవి మోసపూరిత సంస్థలని అని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాటున క్యూనెట్ సంస్థ గొలుసుకట్టు పద్ధతిలో రూ.వేల కోట్లను అమాయకుల నుంచి వసూలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా క్యూనెట్ సంస్థకు చెందిన 36 బ్యాంక్ ఖాతాల్లోని రూ.90 కోట్ల నగదును సీజ్ చేసిందని తెలిపారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలన్నీ క్యూనెట్ మోసపూరితమైన సంస్థ అని వెల్లడించాయని చెప్పారు. ఎంఎల్ఎం కంపెనీల మోసాలు ఏదో ఒక రోజు బయటపడతాయని, వాటిపై రాష్ట్ర పోలీసులే కాక.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తాయని తెలిపారు. అలాంటి మోసపూరిత స్కీమ్ లతో ప్రమేయమున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో లేని సంస్థలను అసలు నమ్మొద్దని ప్రజలకు ఆయన సూచించారు. గొలుసుకట్టు సంస్థలకు ఎలాంటి అనుమతులుండవని స్పష్టం చేశారు. బ్యాంకర్ల కంటే ఎక్కువగా వడ్డీ ఇవ్వడం ఏ సంస్థకు సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పెట్టుబడి పెట్టాలంటే ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలని, నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని హితవు పలికారు. మోసపూరితమైన మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల మాయలో పడొద్దన్నారు. ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఈ గొలుసుకట్టు సంస్థల వల్ల దేశ ఆర్థిక పరిస్థితే కాక.. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సైబరాబాద్ సీపీగా సజ్జనర్ ఉన్న కాలంలో క్యూనెట్ మోసాలను ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దేశవ్యాపంగా దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారు. (చదవండి: Hyderabad: కాలుష్యం..కాస్త తగ్గింది) అంతేకాదు, క్యూనెట్ సంస్థను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ష్రాప్, పూజహెగ్డే, షారుఖ్ ఖాన్ లకు 2019లో నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తంగా 500 మందికి సైబరాబాద్ పోలీసులు అప్పట్లో నోటీసులు జారీ చేయడం గమనార్హం. తాజాగా క్యూనెట్ సంస్థ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో సజ్జనార్ స్పందించారు. క్యూనెట్ లాంటి మోసపూరిత గొలుసుకట్టు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటి మాయలో పడొద్దని సూచించారు. ఎంఎల్ఎం కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. It’s a FRAUD ⚠️ When I was @cpcybd, I registered several cases against #Qnet. Since I felt that #Qnet business model is a FRAUD and DUPED gullible investors, I fought with conviction. @dir_ed’s public disclosure of its findings against Qnet vindicated my stand. pic.twitter.com/elXSEhPSMN — V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 19, 2023 It’s a FRAUD ⚠️ There is a need to widen the crackdown on such entities (firms running pyramid, MLM and other ponzi schemes) and save gullible people. pic.twitter.com/hFOETKLMP1 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 19, 2023 -
చైన్ దందా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొలుసుకట్టు దందాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఇటీవలి కాలంలో క్యూనెట్, హీరా గ్రూపు ఉదంతాలు వెలుగుచూసినా కొత్త పేర్లు, ఐడియాలతో జనాల జేబుకు చిల్లు పెట్టేందుకు నయా మార్గాల్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. వేగంగా డబ్బు రెట్టింపు చేస్తామని ఆశచూపుతూ మధ్యతరగతి ప్రజల జీవితా లతో ఆటలాడుకుంటున్నాయి. తాజాగా సెర్ఫా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట హైదరాబాద్‌లో ఓ కొత్త కంపెనీ వెలిసింది. మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా వ్యాపారం సాగిస్తోంది. ఏడాదిలో లక్షాధి కారులు కావచ్చని అరచేతిలో స్వర్గం చూపిస్తూ అమాయకుల నుంచి భారీగా దండుకుంటోంది. ఎలా చేస్తున్నారు..? సెర్ఫా కంపెనీలో చేరాలంటే ముందుగా రూ. 18 వేలు కట్టాలి. దానికి సమాన విలువ అని చెబుతూ రెండు 100 గ్రాముల బరువున్న ట్యాబ్లెట్ల డబ్బాలు అంట గడతారు. కట్టిన డబ్బు వృథా కాలేదు అనే భావన కస్టమర్‌కు కలిగేలా సంతృప్తి పడేలా నూరిపోస్తారు. వాస్తవానికి ఆ ట్యాబ్లెట్ల విలువ మార్కెట్లో రూ. 1,000–2,000కు మించదు. తరువాత వారికి ఒక ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. అంతకుముందే బ్యాంకు, ఆధార్ ఖాతాల వివరాలు తీసుకొని తొలుత ఖాతాలో రూ. 2 వేలు జమచేస్తారు. ఇక అక్కడ నుంచి ఖాతాదారు తరఫున ఎంత మంది చేరితే అన్ని రూ. 1,200 చొప్పున ఖాతాలో జమ చేస్తామని ఆశచూపుతారు. బంధువులు, స్నేహితులను చేర్పించమంటూ మానవ సంబంధాలపై వ్యాపారం నడిపిస్తున్నారు. వారు తమ కంపెనీలో చేరే ప్రతి ఒక్కరినీ పార్ట్నర్ని అని చెబుతుండటం గమనార్హం. ఏడాదిన్నర కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నారట.. వాస్తవానికి ఈ కంపెనీని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వద్ద 2018 ఏప్రిల్ 26న విశాఖపట్నం కేంద్రంగా రిజిష్ట్రేషన్ చేశారు. అంటే దీని వయసు ఏడాదిన్నరలోపే. కానీ ఇందులో పనిచేసే ఉద్యోగులు మాత్రం తాము 2016 నుంచి ఈ కంపెనీలో చేస్తున్నామని, ఎంటెక్, ఎంబీఏలు చదివి వేల రూపాయల వేతనాలు వదులకొని ఇందులో భాగస్వాములుగా చేరామని గొప్పలు చెబుతున్నారు. ప్రతి వారినీ కంపెనీలో భాగస్వాములంటూ సంబోధించడంతో వెనకా ముందు చూడకుండా పేదలు దిగువ మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులు అప్పు చేసి మరీ పెట్టుబడి పెడుతున్నారు. క్యూనెట్ ప్రెస్‌మీట్‌తో ఖాతాదారుల్లో అనుమానాలు.. ఇటీవల క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ పోలీసులు పెట్టిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలుసుకుని ఇందులో చేరిన ఖాతాదారులు కొందరు ఆలోచనలో పడ్డారు. ఈ కంపెనీ ప్రతినిధులు ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ కాదని చెబుతున్నా.. అదేబాటలో నడుస్తుండటంతో అనుమానం వచ్చి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడం మొదలుపెట్టారు. కానీ, వారిని కంపెనీ ప్రతినిధులు దబాయిస్తున్నారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, కోర్టుకు లాగుతామని బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. అందరిలాగానే వెళ్లిన సాక్షి ప్రతినిధికి కూడా కంపెనీ ఉద్యోగులు అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్నంతా ‘సాక్షి’ రికార్డు చేసింది. తరువాత దీనిపై వివరణ కోరగా.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని తామెవరినీ మోసం చేయడం లేదని చెప్పుకొచ్చారు. చిక్కుకున్నాక మోసం.. ఈ దందాలే మానవ సంబంధాలు, మాటలే పెట్టుబడులు. మోసంలో చిక్కుకున్నాక.. తమ డబ్బును ఎలాగైనా తిరిగి వసూలు చేసుకోవాలని, బంధువులను, స్నేహితులను ఇందులో చేరుస్తున్నారు. ఫలితంగా మోసం వెలుగుచూసాక.. బంధాలు తెగిపోతున్నాయి. ఇలాంటి బాధితుల్లో అధికంగా సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు, ఎంటెక్, ఎంబీఏలు చదివిన గ్రాడ్యుయేట్లు కావడం గమనార్హం. డబ్బులిమ్మంటే బెదిరిస్తున్నారు.. మొదట్లో ఇదేదో మామూలు స్కీం అనుకున్నా. అందుకే పొరుగింటావిడ చెప్పిందని చేరాను. మొన్న క్యూనెట్ గురించి వార్తల్లో చదివా. రెండూ ఒకేరకంగా ఉండటంతో కంపెనీ ప్రతినిధులను నిలదీశా. వారు కంపెనీకి అనుమతులు ఉన్నాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటామని తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారు. – తులసి, గృహిణి, కేపీహెచ్‌బీ కాలనీ పేరేదైనా.. చివరి లక్ష్యం మోసమే..! హైదరాబాద్‌లో రకరకాల పేర్లతో అక్రమార్కులు జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. అందుకు పోంజి, మల్టీలెవల్ మార్కెటింగ్, హెర్బల్ ఇలా తదితర మార్గాల్లో దందాలు చేస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే.. జనాల నుంచి తక్కువ సమయంలో అందినకాడికి దండుకోవడం. క్యూనెట్: రాష్ట్ర రాజధాని ఇటీవల వెలుగుచూసిన మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం విలువ దాదాపు రూ. 1,000 కోట్లపైనే. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టి దారుణంగా మోసపోయాడు. తనతోపాటు స్నేహితులు, బంధువులనూ చేర్పించాడు. వారి వద్ద మొహం చెల్లక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. హీరా: ఇదో రకమైన పోంజి స్కీం. అధిక వడ్డీ ఆశజూపి హైదరాబాద్ కేంద్రంగా సాగిన దందా ఇది. దీని విలువ ఏకంగా రూ. 5,000 కోట్లు. ఈ పథకంలో చేరిన వారిలోనూ అధిక శాతం విద్యావంతులు, గ్రాడ్యుయేట్లే ఉండటం గమనార్హం. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ సంస్థా అధిక వడ్డీ చెల్లించదన్న చిన్న పాయింట్‌ను బాధితులెవరూ గుర్తించకపోవడం కుంభకోణానికి అసలు కారణం. కరక్కాయలు: రోజుకు కిలో కరక్కాయలు దంచిపెడితే రూ. 1,000 ఇస్తామని ఆశచూపి కోట్ల రూపాయలు దండుకున్న విషయం తెలిసిందే. నెల్లూరుకు చెందిన ఓ కేటుగాడు ప్రారంభించిన ఈ దందాలో చిక్కి 650 మంది మహిళలు దాదాపు రూ.8.3 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. -
‘క్యూనెట్’పై ఈడీ
సాక్షి, హైదరాబాద్: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయకులను రూ. వేల కోట్లకు బురిడీ కొట్టించిన క్యూనెట్ సంస్థపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలో రంగంలోకి దిగ నుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును విదేశాలకు తరలించిం దన్న ఆరోపణలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తు ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసులు మొత్తం అందజేసినట్లు సమాచారం. వాటి ఆధారంగానే త్వర లోనే ఈడీ అధికారులు ఈ కేసులో నేరుగా రంగంలోకి దిగను న్నారు. క్యూనెట్ సంస్థ వేలాది మంది బాధి తుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలను విదేశాలకు ఎలా తరలిం చారు? ఎవరి సాయం తీసుకున్నారు? ఎంత మొత్తాన్ని విదేశాలకు చేరవేశారు? అక్కడ ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారా? దేశంలోనూ పలు చోట్ల వీరు ఆస్తులు కూడబెట్టారా? వంటి విషయాలపై ఆరా తీయనుంది. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌కు సంబంధించి మొత్తం 38 కేసులు నమోదవగా 70 మందిని అరెస్టు చేశారు. వారిలో కీలకమైన 12 మంది వ్యక్తులు పారిపోకుండా ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉండి రూ. కోట్లు కాజేసిన వ్యక్తులు, ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు ఈడీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారని తెలిసింది. అయితే దీనిపై ఇపుడే ఏమీ చెప్పలేమని ఓ అధికారి తెలిపారు. ఐదేళ్ల కిందటే క్యూనెట్ అక్రమ దందా..! క్యూ గ్రూప్ (హాంకాంగ్)కు చెందిన విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ’క్యూనెట్’పేరిట భారత్‌లో జరుపుతున్న ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలో దాదాపు రూ. 5000 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. జనవరిలో హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ దందాకు సంబంధంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీలోనూ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఐదేళ్ల కిందటే మహారాష్ట్రలో క్యూనెట్ అక్రమాలపై తొలుత కేసులు నమోదయ్యాయి. మల్టీలెవల్ సంస్థల్లో ఎవరూ చేరొద్దు: సజ్జనార్ క్యూనెట్ అనుబంధ సంస్థ విహన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మూసివేసే దిశగా కేంద్ర కార్పొరేట్ వ్యవహరాలశాఖ చర్యలు చేపట్టిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కంపెనీ సహా మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థల్లో ఎవరూ సభ్యులుగా చేరవద్దని సూచించారు. విహన్ సంస్థలో ఇప్పటికే చేరిన వారు ప్రమోటర్లకు డబ్బు చెల్లించవద్దని, అలా చేస్తే వారే నష్టపోతారని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చేపట్టిన చర్యలను వివరించడంతోపాటు ప్రజలను ఎంఎల్ఎం మోసాలపై జాగృతపరిచేలా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సజ్జనార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 2.7 కోట్లను ఫ్రీజ్ చేశామని, బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన సెలబ్రిటీలు అనిల్ కపూర్, షారూఖ్‌ఖాన్, బొమన్ ఇరానీ, జాకీష్రాఫ్, వివేక్ ఒబెరాయ్, పూజా హెగ్డే, అల్లు శిరీష్‌లకు నోటీసులు జారీ చేశామన్నారు. అనిల్ కపూర్, షారూఖ్‌ఖాన్, బొమన్ ఇరానీలు వారి అడ్వొకేట్ల ద్వారా బదులిచ్చారని, మిగతా వాళ్ల నుంచి ఇంకా సమాధానం రాలేదన్నారు. వారితోపాటు మొదటి 500 ప్రమోటర్లకు కూడా నోటీసులు జారీ చేసినా సమాధానాలు రాలేదని సజ్జనార్ చెప్పారు. బాధితుల ఫిర్యాదులతో కేంద్రం సైతం ఈ సంస్థపై దర్యాప్తు చేపట్టాలని సౌత్ ఈస్ట్ రీజియన్ హైదరాబాద్ ఆర్వోసీని గతంలోనే ఆదేశించిందన్నారు. ఆర్వోసీ నివేదిక ఆధారంగా ఆ కంపెనీని మూసేయాలని బెంగళూరు ఆర్వోసీని ఆదేశించడంతోపాటు ఈ కంపెనీకి అనుబంధంగా ఉన్న 12 మందిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిందని సజ్జనార్ వివరించారు. ఇందుకు సంబంధించిన కాపీని ఆయన మీడియాకు చూపించారు. కార్యక్రమంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ అధికారులు పాల్గొన్నారు. -
క్యూనెట్ స్కాంలో 70 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : క్యూనెట్ స్కామ్‌లో 70 మందిని అరెస్ట్ చేసి వారిపై 38 కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి బెంగుళూరులో రూ. 2.7 కోట్ల నగదును సీజ్ చేసినట్లు, క్యూనెట్‌ను ప్రచారం చేసిన సినీ ప్రముఖులకు నోటిసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్యూనెట్ సంస్ధ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసం చేస్తున్నారని, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో బాధితులు ఉన్నట్లు వెల్లడించారు. క్యూనెట్ కంపెనీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పెట్టుబడుల్లో వచ్చిన డబ్బుని వాడుకుంటున్నారని, దేశ వ్యాప్తంగా క్యూనెట్ సంస్థ 5 వేల కోట్ల రూపాయలు మోసం చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ సంస్థపై అనేక ఫిర్యాదులు అందడంతో ఈ కేసును లోతుగా విచారించాలని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ ఆదేశాలు ఇచ్చిందన్నారు. 15 రోజుల క్రితం క్యూనెట్ బాధితుడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని, మరో వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్యూనెట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు దేశం దాటి పోకుండా 12 మందిపై లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. కేవలం డబ్బులు వసూలు చేయడమే వీరి పని అని, ఇలాంటి మార్కెటింగ్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. క్యూనెట్కు ఎలాంటి రికార్డులు లేవని, రూ.100 విలువ చేసే వస్తువు రూ.1500 కి అమ్మకాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు టోకరా వేసిన ముఠా గుట్టు రట్టు బ్యాంకు ఉద్యోగులను మోసం చేసిన ముఠా గుటు రట్టు అయ్యింది. బ్యాంక్ ఉద్యోగులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురిని అరుణ్, లోకేష్ తోమర్, మోహిత్ కుమార్, మనోజ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. పెద్ద కార్ల షో రూమ్‌లను వేదికగా చేసుకొని దేశ వ్యాప్తంగా భారీ మోసాలు చేస్తూ అనేక మందిని మోసం చేసినట్లు పేర్కొన్నారు. కావున బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సరైన సమాచారం లేకుండా డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. నిందితుల నుంచి మూడు లక్షల నగదుతోపాటు ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
క్యూనెట్ కేసు; ఆ ముగ్గురు సమాధానం ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్: వేలకోట్ల కుంభకోణం జరిగిన మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ కేసులో పలువురు బాలీవుడ్ నటులకు సైబరాబాద్ పోలీసులు ఇదివరకే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మొదటిసారి నోటీసులకు స్పందించని ఆరుగురు బాలీవుడ్ నటులకు.. మళ్లీ రెండోసారి కూడా నోటీసులు పంపారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో షారుక్ ఖాన్, అనిల్ కపూర్, బోమన్ ఇరానీలు మాత్రమే తమ లీగల్ అడ్వకేట్ ద్వారా సమాధానం ఇచ్చారు. అయితే మరో ముగ్గురు పూజా హెగ్దే, వివేక్ ఒబేరాయ్, జాకీ ష్రాఫ్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. క్యూనెట్ కేసులో సైబరాబాద్ పోలీసులు మొత్తం 500 మందికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజలు కిందట మాదాపూర్‌కు చెందిన క్యూనెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. -
క్యూనెట్ బాధితుడు అరవింద్ ఆత్మహత్య
హైదరాబాద్: రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డ మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ ఓ యువకుడిని బలి తీసుకుంది. క్యూనెట్‌లో పెట్టుబడి పెట్టిన బాధితుడు ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన అడపు అరవింద్ (31) చందానాయక్ తండాలోని సీఎస్ఆర్ ఎస్టేట్‌లో రెండేళ్లుగా నివాసం ఉంటున్నాడు. లిగిన్ ఫెర్నాండేజ్ అనే అతనితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఫెర్నాండేజ్ డ్యూటీ కి వెళ్లగా అరవింద్ ఇంట్లోనే ఉన్నాడు. డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన ఫెర్నాండేజ్ డోర్ కొట్టగా స్పందించలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా అరవింద్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి వద్ద క్యూనెట్ ఐడీ కార్డు లభించింది. కాగా, అరవింద్ అసెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి 2017లో ఉద్యోగం మానేశాడు. క్యూనెట్‌లో 2017లో రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాడు. రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న అరవింద్‌కు పెట్టిన డబ్బులు రాకపోగా ఉద్యోగం కూడా లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
క్యూనెట్ చేతిలో మోసపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
క్యూనెట్ బాధితుడి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : క్యూనెట్ చేతిలో మోసపోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీకాకుళంకు చెందిన అరవింద్ నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. గతంలో అరవింద్ క్యూనెట్‌లో 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. చాలాసార్లు తన డబ్బులు తనకు వెనక్కి వెళ్లాలని అడిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన అరవింద్ మంగళవారం రాత్రి మాదాపూర్‌లో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూసెట్ సంస్థల కొన్ని లక్షల మందిని మోసం చేసింది. ఐటీ కారిడార్లైన ముంబై, బెంగళూర్, నోయిడా, అహ్మదాబాద్ లాంటి అనేక నగరాల్లో క్యూ నెట్ సంస్థ కోట్లు వసూలు చేసింది. బిజినెస్ ప్లాన్ ఉందని అమాయక, నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తూ ముగ్గులోకి దింపి కోట్ల రూపాయలు దంచుకున్నారు. కూనెట్ మోసాలపై సైబరాబాద్ కమిషనరేట్‌లో పలు సంఖ్యల్లో కేసులు నమోదయ్యాయి. (చదవండి : క్యూనెట్ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!) -
క్యూనెట్ కేసులో ప్రముఖులకు నోటీసులు
-
క్యూనెట్ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్ ‘క్యూనెట్’కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు క్యూనెట్ ఫ్రాంచైజీ విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన 14 కేసుల్లో దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. తాజాగా ఈ సంస్థకు అంబాసిడర్లుగా వ్యవహరించిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వీరిలో శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్, సినీ రంగ ప్రముఖులు బొమన్ ఇరానీ, షారుక్ ఖాన్, అల్లు శిరీష్, పూజా హెగ్డేతో పాటు క్యూనెట్ కంపెనీ సీఈవోలు, డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు, క్రికెటర్లు దాదాపు 500 మంది ఉన్నారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరంతా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. వీరిచ్చే సమాచారం ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. క్యూనెట్ కేసులో పోలీసుల దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 3 లక్షల మందిని మోసగించినట్లుగా తెలుస్తోందన్నారు. దర్యాప్తు పూర్తయితే తప్ప ఎంత మందిని, ఎంత మొత్తంలో మోసం చేశారన్నదానిపై స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటివరకు రూ.10 వేల కోట్లకుపైగా మోసం చేసినట్లు గుర్తించామన్నారు. జనవరి తొలి వారంలో 14 కేసుల్లో 58 మందిని అరెస్టు చేసి ఆ కంపెనీకి చెందిన బ్యాంక్ ఖాతాల్లోని రూ.2.7 కోట్లు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విహన్ డైరెక్ట్ కంపెనీ డైరెక్టర్‌తో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. -
క్యూనెట్ గుట్టు రట్టు.. 58 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్: డబ్బు ఆశ చూపి వేల సంఖ్యలో బాధితులకు కుచ్చుటోపి పెట్టిన క్యూనెట్ మోసగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులను, అమాయకులను ట్రాప్ చేసి చైన్ సిస్టమ్ ద్వారా ప్రైజ్ మనీ, కమీషన్లు వస్తాయంటూ నమ్మించి మోసాలకు పాల్పడిన 58 మంది కేటుగాళ్లను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఇచ్చిన పిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సైబరాబాద్ ఈవోడబ్ల్యూ(ఎకానిమిక్స్ అఫెన్స్ వింగ్) అధికారులు మల్టిలెవల్ మార్కెటింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. సైబరాబాద్ పరిధిలో క్యూనెట్ మోసంపై 14 కేసుల నమోదయినట్టు పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా క్యూనెట్ బ్యాంకు అకౌంట్లను, గోదాంలను సీజ్ చేసినట్లు వివరించారు. అరెస్టు చేసిన 58 మందిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే క్యూనెట్ చైర్మన్ మైకెల్ ఫెరారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. రూ.1000 కోట్ల మోసం బిజినెస్ ప్లాన్ ఉందని అమాయక, నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తూ ముగ్గులోకి దింపి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేటుగాళ్లను ఆరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పలు రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం సజ్జనార్ పలు విషయాలు వెల్లడించారు. ‘వివధ రకాల కేసుల్లో మొత్తం 58 మందిని అరెస్టు చేశాము. క్యూనెట్ సంస్థ సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముఠాలో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నాం. 2001 నుంచి వీళ్లు వ్యాపారం చేస్తున్నారు. కచ్చితంగా అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అంటూ సజ్జనర్ వివరించారు. -
క్యూనెట్ కేసులో మాజీ క్రీడాకారుడి అరెస్ట్
-
క్యూనెట్ కుంభకోణం కేసులో మాజీ క్రీడాకారుడి అరెస్ట్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన క్యూనెట్ కుంభకోణం కేసులో ఆ సంస్థ డైరెక్టర్, ప్రముఖ క్రీడాకారుడు, పద్మ భూషణ్ అవార్డీ మైఖెల్ ఫరేరాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కామర్స్ సంస్థగా చెప్పుకునే క్యూనెట్.. ఇంటర్నెట్ లో మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట దాదాపు 5 లక్షల మంది ఇన్వెస్టర్ల నుంచి వేల కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేసింది. క్యూనెట్ చేతిలో మోసపోయిన ఓ హైదరాబాద్ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఫిబ్రవరిలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘ దర్యాప్తులో అనేక ఆధారాలను సేకరించిన హైదరాబాద్ పోలీసులు సంస్థ డైరెక్టర్ అయిన మైఖెల్ తోపాటు మరో ముగ్గురిని మంగళవారం రాత్రి ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై కోర్టు అనుమతితో బుధవారం ఉదయం వారిని హైదరాబాద్ కు తరలించి విచారిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన సత్తాచాటిన మైఖెల్ ఫరేరా బిలియడ్స్ లో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్. క్రీడారంగానికి అతని సేవలను గుర్తిస్తూ 1983లో కేంద్ర ప్రభుత్వం మూడో అత్యున్నత పౌరపురస్కారం 'పద్మ భూషణ్' ప్రకటించింది. క్యూనెట్ సంస్థ పిరమిడ్ తరహాలో నిర్వహించిన ఆన్ లైన్ మల్టీలెవల్ మార్కెటింగ్ లో తెలంగాణ, ఏపీలే కాక దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన లక్షలాదిమంది డబ్బు చెల్లించి మోసపోయారు.