హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్(ఎంఎల్‌ఎం) క్యూనెట్ కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా, చిన్నంపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ ఉపేంద్ర నాథ్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నా రు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (క్యూనెట్)పై మహంకాళి పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమో దయ్యాయి. అనంతరం అదనపు సీపీ(ఎస్‌ఐటీ) ఆదేశాల మేరకు ఈ కేసుల ను హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వి–అంపైర్ పేరుతో నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో గుర్తించిన అధికారులు 15 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు.
వీరు అధిక లాభాలు ఆశ చూపించి నిరుద్యోగులు, గ్రామీణులు, అమాయకుల నుంచి డబ్బులు సేకరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ప్రధా న నిందితులు రాజేష్‌ఖన్నా, సీహెచ్ ఉపేంద్రనాథ్‌రెడ్డి ప్రేరణ క్లాసులు నిర్వహించి సామాన్యులను మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో పెట్టుబడులను ఆకర్శించేవారు, ఈ క్రమంలో పెట్టుబడుల పెట్టిన వారికి నెలకు రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపారు.
రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కో బాధితుడి నుంచి రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు చార్జీల రూపంలో వసూలు చేశారు. ఇదే తరహాలో దాదాపు 163 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్‌లకు చెందిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్ల నగదును సీజ్ చేసిన పోలీసులు ఇప్పటివరకు 15 మంది నిందితుల్లో 9 మందిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment