సాక్షి, హైదరాబాద్: క్యూనెట్ స్కాంకు సంబంధించి వీహాన్ డెరెక్ట్ సెల్లింగ్ సంస్థపై ఈడీ కొరడా ఝులిపించింది. ఈ కంపెనికీ చెందిన రూ.137కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరులోని 8 భవనాలను జప్తు చేసింది. సైబరాబాద్‌లో నమోదైన కేసు విచారణలో భాగంగా ఈమేరకు హైదరాబాద్ విభాగం ఈడీ చర్యలు తీసుకుంది. 58 బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసింది.
దేశవ్యాప్తంగా క్యూనెట్‌పై మొత్తం 38 చోట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ 9 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంది.
చదవండి: పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment