సాక్షి, నిజామాబాద్ : బోధన్‌లో రోహింగ్యాలు ఉన్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఛాలెంజ్ చేశారు. బోధన్‌లో బంగ్లాదేశ్ వాసులు కొందరు అక్రమ పత్రాలతో పాసు పోర్టులు పొందిన విషయంపై ఆయన మాట్లాడారు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. ఒకే ఇంటి నంబర్ మీద 32కు పైగా పాసు పోర్టులు పొందుతుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పాసుపోర్టుల అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.. ఎంపీ అరవింద్ కేంద్రంలోని బీజేపీకి చెందిన ఎంపీ కాబట్టి ఆయన కేంద్రంతో మాట్లాడి పాసుపోర్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment