ట్వంటీ ట్వంటీ లవ్‌ | Love 20-20 movie is a Crazy Romantic Film | Sakshi
Sakshi News home page

ట్వంటీ ట్వంటీ లవ్‌

Published Sun, Feb 3 2019 5:21 AM | Last Updated on Sun, Feb 3 2019 5:21 AM

Love 20-20 movie is a Crazy Romantic Film - Sakshi

అరవింద్, మోహిని

అరవింద్, మోహిని జంటగా సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి ‘లవ్‌ 20–20’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్‌ వడ్లపట్ల, మహేందర్‌ వడ్లపట్ల, జో శర్మ నిర్మిస్తున్నారు. మెక్విన్‌ గ్రూప్‌ (యూఎస్‌ఏ) సహనిర్మాత. ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. కొంత ప్యాచ్‌ వర్క్‌తో సహా, ఫైనల్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ఈ నెల 6 వరకు జరుగుతుంది. ‘‘మంచి కథ కుదిరింది. హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు కొత్తగా ఉంటాయి. యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్యన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement