
కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్ సౌత్ సినిమాల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మామనితమ్, విక్రమ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గాయత్రీ 2012లో '18 వయసు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి.. 'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ హీరోయిన్‌పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అర్వింద్‌తో డేటింగ్‌లో కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
(ఇది చదవండి: కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!)
ఆమె ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఫోటోలో గాయత్రి, అరవింద్ ఎస్‌ఏను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఈ జంట డేటింగ్‌లో ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇన్‌స్టాలో గాయత్రి రాస్తూ.. 'కమెడియన్‌గా అతని ఎదుగుదలను ప్రశంసించింది. అతని పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది.
అసలు అరవింద్ ఎవరు?
తన కామెడీతో అందరినీ నవ్వించే అరవింద్ ఎవరో తెలుసుకుందాం. అతని అసలు పేరు అరవింద్ సుబ్రమణ్యం. అందరూ అతన్ని అరవింద్ ఎస్‌ఏ అని పిలుస్తారు. ఈ స్టాండప్ కమెడియన్ మొదట 2013లో తమిళ చిత్రం ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు.
యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందాడు. అరవింద్ మద్రాసీ డా లాంటి షోలో కూడా కనిపించాడు. ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్‌లో "ఐ వాజ్ నాట్ రెడీ డా" షోను విడుదల రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 'వీ నీడ్ టూ టాక్' అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నాడు.
(ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! )
Comments
Please login to add a commentAdd a comment