బండి సంజయ్ (బీజేపీ), డి.అర్వింద్ (బీజేపీ)
నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల్లో రసవత్తర రాజకీయం
ప్రధాన పార్టీల్లో రాజయోగం వరించేదెవరినో?
క్రితంసారి అనూహ్య విజయాలు నమోదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జగిత్యాల, మెట్‌పల్లి నిజామాబాద్ పరిధిలోకి, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ కరీంనగర్ పరిధిలోకి, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. మూడు స్థానాల్లోనూ అభ్యర్థులకు ఈ ఎన్నికలు చాలా కీలకం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా వీటిని కై వసం చేసుకోవాలని చూస్తున్నాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండింటినైనా గెలిచి, తిరిగి పట్టు నిలుపుకోవాలని పావులు కదుపుతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సామాన్యులుగా రంగంలోకి దిగిన బండి సంజయ్(కరీంనగర్) సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఓడించి, ధర్మపురి అర్వింద్(నిజామాబాద్) సిట్టింగ్ ఎంపీ కవితపై పైచేయి సాధించి, అనూహ్య విజయాలను అందుకున్నారు. ఈసారి తమ స్థానాలను నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా వ్యూహాలు రచిస్తోంది.
నినాదాలు.. మేనిఫెస్టోలు..
నిజామాబాద్, పెద్దపల్లిల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించాయి. వా రు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్(బీఆర్‌ఎస్), ధర్మపురి అర్వింద్(బీజేపీ), తాటిపర్తి జీవన్‌రెడ్డి(కాంగ్రెస్)లు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ(కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (బీజేపీ), కొప్పుల ఈశ్వర్ (బీఆర్‌ఎస్)లు బరిలో ఉన్నారు. కీలకమైన కరీంనగర్ నుంచి బండి సంజయ్(బీజేపీ), బి.వినోద్‌కుమార్(బీఆర్‌ఎస్)లు బరిలో ఉండగా.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
దేశభక్తి, అయోధ్య రామాలయం, ఉమ్మడి జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు, హిందుత్వమే ఏజెండాగా బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం కట్టబెట్టిన 6 గ్యారంటీలనే కాంగ్రెస్ నమ్ముకుంది. దీనికితోడు కేంద్ర నాయకత్వం ప్రకటించిన ‘పంచన్యాయ్’, రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రకటించిన మేనిఫెస్టో తమకు మేలు చేస్తాయని భావిస్తోంది. జాతీయ పా ర్టీలు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవని, తెలంగా ణగళం పార్లమెంట్‌లో వినిపించాలంటే.. తప్పకుండా తమను గెలిపించాలని బీఆర్‌ఎస్ కోరుతోంది.
ఈసారి ఖర్చు రూ.కోట్లలోనే..
ఈసారి పార్లమెంట్ ఎన్నికల ఖర్చు క్రితంసారితో పోలిస్తే పెరిగేలా ఉంది. ప్రచారం, పెట్రోల్, భో జనం, సభల నిర్వహణ ఖర్చు అమాంతం పెరిగింది. ఇక, జన సమీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెక్కన అభ్యర్థుల వ్యయం శ్రీ క్రోధి నా మ సంవత్సరంలో రూ.కోట్లలో ఉండనుందని స మాచారం. దీనికి ప్రతిఫలంగా ప్రజలు ఓట్ల రూపంలో ఆదాయం ఇవ్వనున్నారు.
ఇది ఎవరికి అధికంగా ఉంటే వారినే రాజయోగం వరించనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే తమ జాతకాలను పరీక్షించుకుంటున్నారు. ఎవరి ఆదాయ, వ్యయాలు ఎంత? ఎవరి రాజపూజ్యం ఎంత? ఎవరికి రాజయోగం ఉంది? తదితర వివరాలను పండితులను అడిగి తెలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment