
మృతిచెందిన అరవింద్
సాక్షి, మారేడ్‌పల్లి: అతిగా మద్యం సేవించవద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఓ యువకుడు అత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం మారేడుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పికెట్ చాకలి బస్తీకి చెందిన అరవింద్ (23) అమీర్‌పేట్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు.
తల్లిదండ్రులు అతిగా మద్యం ఎందుకు సేవించావంటూ మందలించారు. దీంతో కోపంతో మద్యం మత్తులో రాత్రి ఇంట్లో తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి కుటుంబసభ్యులు అరవింద్ గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. 108కు సమాచారం అందించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment