Maredpally
-
కారుమీద కూలిన భారీ వృక్షం
-
సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
-
ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్!
సాక్షి,హైదరాబాద్: నగరంలో తొలిసారి ఓ చైన్ స్నాచర్ ఒంటరిగా వరసపెట్టి పంజా విసిరాడు. బుధవారం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆరు నేరాలు చేశాడు. ఐదు చోట్ల గొలుసు లు అతడికి చిక్కగా.. మరో ప్రాంతంలో ప్రయత్నం ఫలించలేదు. పేట్‌బషీరాబాద్, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, మేడిపల్లి ఠాణాల పరిధిలో ఐదున్నర గంటల వ్యవధిలోనే ఈ ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జర్కిన్ వేసుకున్న యువకుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి.. యాక్టివా వాహనంపై సంచరిస్తూ ఈ నేరాలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఆధారాలతో ముందుకెళ్తున్నాయి. నిందితుడు వినియోగించిన యాక్టివా వాహనం మంగళవారం మధ్యాహ్నం ఆసిఫ్‌నగర్ పరిధిలోని జిర్రా రోడ్డులో చోరీకి గురైనట్లు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తుకారాం గేట్ పీఎస్ పరిధిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుడు సుదీర్ఘ కాలం తర్వాత.. మహా నగరం ఒకప్పుడు వరుస స్నాచింగులతో బెంబేలెత్తిపోయేది. స్నాచర్ల బారినపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. 2014 తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా వరుస ఉదంతాలు లేకపోయినా.. అడపాదడపా స్నాచర్లు పంజా విసురుతూనే ఉన్నారు. 2018 డిసెంబర్లో ఆఖరుసారిగా వరుస స్నాచింగ్స్ చోటుచేసుకున్నాయి. ఆ నెల చివరి వారంలో ఉత్తరప్రదేశ్‌లోని బవారియా నుంచి వచ్చిన గ్యాంగ్ కేవలం రెండు రోజుల వ్యవధిలో రాచకొండ పరిధిలోని 9 ప్రాంతాల్లో పంజా విసిరింది. ఈ గ్యాంగ్‌ను వారం రోజుల్లోనే హైదరాబాద్ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత గడిచిన రెండేళ్లల్లో ఈ తరహాలో వరుస ఉదంతాలు చోటుచేసుకోలేదు. అదను చూసుకుని పంజా.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గడిచిన కొన్నాళ్లుగా హడావుడి నెలకొంది. కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో న్యూ ఇయర్ వేడుకలు, ఆ తర్వాత వచ్చిన సంక్రాంతి పండగ నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తంగా వ్యవహరించింది. సాధ్యమైనంత వరకు నేరాలు జరగకుండా వ్యూహాత్మకంగా గస్తీ నిర్వహించింది. గడిచిన కొన్ని రోజుల్లో మూడు కమిషనరేట్లలోని పోలీసుల్లో అనేక మంది కరోనా బారినపడ్డారు. దాదాపు 800 మందికి పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌కు వెళ్లారు. దీని ప్రభావం పోలీసింగ్‌తో పాటు ఠాణాల నిర్వహణ, గస్తీపై పడింది. ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న చైన్ స్నాచర్ అదను చూసుకుని, గస్తీ లేని ప్రాంతాల్లో సంచరిస్తూ వరుసగా మూడు కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరాడు. తుకారాం గేట్ పీఎస్ పరిధిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుడు 22.3 కి.మీ.. 18.5 తులాలు.. సైబరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో ఇతగాడు తన ‘పని’ ప్రారంభించాడు. అక్కడ నుంచి రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్‌నగర్ కాలనీల్లో ‘సంచరిస్తూ’.. హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రవేశించి మారేడుపల్లి ఠాణా పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీలో పంజా విసిరాడు. అట్నుంటి తుకారాంగేట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సమోసా గార్డెన్స్ వద్ద చివరి స్నాచింగ్ చేశాడు. చివరగా రాచకొండ కమిషనరేట్‌లోని మేడిపల్లి పరిధిలో ఉన్న బోడుప్పల్ లక్ష్మినగర్ కాలనీలో పంజా విసిరాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదటి ఉదంతం జరిగితే ఆ ప్రాంతానికి 22.3 కి.మీ దూరంలో సాయంత్రం 4.30 గంటలకు చివరి ఉదంతం చోటుచేసుకుంది. నాలుగు చోట్ల ‘సఫలీకృతుడైన’ స్నాచర్.. మొత్తం 18.5 తులాల బంగారం చేజిక్కించుకున్నాడు. స్నాచర్ కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీలకు చెందిన ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ముందుకు వెళ్తున్నాయి. ‘ముగ్గురూ’ పోటాపోటీగా... మూడు కమిషనరేట్ల పరిధిలో హల్చల్ చేసిన చైన్ స్నాచర్ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబరాబాద్, రాచకొండలకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ పోటాపోటీగా గాలిస్తున్నాయి. తుకారాంగేట్ తర్వాత అడ్డగుట్ట నుంచి సదరు స్నాచర్ రాచకొండ పరిధిలోకి ప్రవేశించి మేడిపల్లిలో పంజా విసిరాడు. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు గాలింపు చేపట్టారు. బుధవారం రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లోని దాదాపు 150 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. నగర పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘సైబరాబాద్, రాచకొండ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నాం. స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నామంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదు. ఒకటిరెండు రోజుల్లో కచ్చితంగా పట్టుకుంటాం’ అని అన్నారు. ► భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఉమారాణి తన ఇంటి ఎదుట నిల్చుని ఉండగా.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచుకుపోయేందుకు ప్రయత్నించాడు. ఆమె వారిస్తూ గట్టిగా అరవడంతో సఫలీకృతుడు కాలేదు. ►రాఘవేంద్ర కాలనీకి చెందిన అనురాధ కూరగాయలు ఖరీదు చేసేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన స్నాచర్ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కుపోయాడు. ► శ్రీరామ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వరలక్ష్మి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని బాలానగర్ వైపు పారిపోయాడు. ►మారేడుపల్లి పరిధిలోని సంజీవయ్య నగర్‌కు చెందిన విజయ (55) కుమార్తె ఏఓసీ సెంటర్ సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయ అక్కడ నుంచి సమీపంలోనే ఉన్న తమ బస్తీకి కాలినడకన బయలుదేరింది. ఇంద్రపురి రైల్వే కాలనీ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన స్నాచర్ ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ► తుకారాంగేట్ పరిధిలోని నందనార్ నగర్ సమోసా గార్డెన్స్ వద్ద అద్దె ఇంటికోసం వెతుకుతున్న సాయినగర్‌కు చెందిన రాంబాయి (65) మెడలోంచి రెండు తులాల చైను లాక్కెళ్లాడు. అక్కడ నుంచి అడ్డగుట్ట చౌరస్తా మీదుగా ఉండాయించాడు. ► మేడిపల్లి ఠాణా పరిధిలోని బోడుప్పల్ లక్ష్మినగర్ కాలనీకి చెందిన కట్ట అంజమ్మ (50) వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. దొంగతనం జరిగిందిలా.. ► ఉదయం 11గం.. భాగ్యలక్ష్మి కాలనీ ఉమారాణి స్నాచింగ్‌కు యత్నం ►ఉదయం 11:10 గం.. రాఘవేంద్ర కాలనీ అనురాధ, 2 తులాలు ►ఉదయం 11:20 గం.. శ్రీరాంనగర్ కాలనీ వరలక్ష్మి, 4 తులాలు ►మధ్యాహ్నం 12:30 గం.. ఇంద్రపురి రైల్వే కాలనీ విజయ, 5 తులాలు ►మధ్యాహ్నం 12:55 గం.. సమోసా గార్డెన్స్ రాంబాయి, 2.5 తులాలు ►సాయంత్రం 4:30గం.. లక్ష్మీనగర్ కాలనీ అంజమ్మ, 5 తులాలు -
ఓఎల్ఎక్స్: 8 సార్లు బకరాను చేశారు..
సాక్షి, సిటీబ్యూరో: తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్ఎక్స్ ద్వారా రూ.6,500 అమ్మాలని భావించిన మారేడ్‌పల్లి వాసి సైబర్ నేరగాడి చేతికి చిక్కి రూ.1.96 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన సుశీల్ తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాడు ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సుశీల్‌ను సంప్రదించారు. ఆ సోఫా తమకు నచ్చిందని, రూ.6,500 గూగుల్ పే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. దీనికి సుశీల్ అంగీకరించడంతో ఓ క్యూఆర్ కోడ్ పంపాడు. దీన్ని సుశీల్ స్కాన్ చేయగా... రూ.6,500 తన ఖాతాలోకి రావాల్సింది పోయి... ఆ మొత్తం కట్ అయింది. దీంతో ఆయన సైబర్ నేరగాడికి ఫోన్ ద్వారా సంప్రదించారు. ఏదో పొరపాటు జరిగిందంటూ చెప్పిన అతడు ఈసారి మొత్తం రూ.13 వేలకు క్యూఆర్ కోడ్ పంపుతున్నట్లు చెప్పాడు. అలా వచ్చిన దాన్ని స్కాన్ చేయగా... రూ.13 వేలు కట్ అయ్యాయి. ఇలా మొత్తం ఎనిమిది సార్లు కోడ్స్ పంపి స్కాన్ చేయించిన సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.1.96 లక్షలు కాజేశాడు. మరోసారి కోడ్ పంపిస్తానంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: రూ.1.04 కోట్ల ఆభరణాల పట్టివేత -
తల్లీకూతుళ్లు అదృశ్యం
మారేడుపల్లి: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఇద్దరు కుమార్తెలతో సహా అదృశ్యమైన సంఘటన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్‌మారేడుపల్లికి చెందిన రవికుమార్, శైలజలు పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, గత కొన్నాళ్లుగా రవికుమార్ భార్యను అనుమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో మనస్తాపానికిలోనైన శైలజ కుమార్తెలు జాహ్నవి, కీర్తితో కలిసి ఇంటినుంచి వెళ్లి పోయింది. శైలజ తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మారేడుపల్లి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాగొద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
సాక్షి, మారేడ్‌పల్లి: అతిగా మద్యం సేవించవద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఓ యువకుడు అత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం మారేడుపల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పికెట్ చాకలి బస్తీకి చెందిన అరవింద్ (23) అమీర్‌పేట్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతిగా మద్యం ఎందుకు సేవించావంటూ మందలించారు. దీంతో కోపంతో మద్యం మత్తులో రాత్రి ఇంట్లో తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి కుటుంబసభ్యులు అరవింద్ గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. 108కు సమాచారం అందించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మారేడ్‌పల్లిలో పోలీస్‌స్టేషన్‌పై దాడి
* తమ ప్రాంతానికి చెందిన యువకుడిని పోలీసులు కొట్టిచంపారంటూ స్థానికుల దాడి * కంప్యూటర్లు, సామగ్రి ధ్వంసం.. ఆవరణలోని పలు వాహనాలకు నిప్పు * ఐదుగురు పోలీసులకు గాయాలు హైదరాబాద్: తమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అన్యాయంగా కొట్టిచంపారంటూ... సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాదాపు 200 మంది దాడికి దిగారు. పోలీస్‌స్టేషన్‌లోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు, ఫైళ్లను చిందరవందర చేసి, స్టేషన్ ఆవరణలో ఉన్న కొన్ని వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు తేరుకునే లోపే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. మారేడ్‌పల్లి వాల్మీకినగర్‌కు చెందిన బన్నప్ప అనే ఆటో డ్రైవర్ ఆదివారం జరిగిన బోనాల వేడుకల సందర్భంగా అక్కడ బందోబస్తులో ఉన్న ఒక హోంగార్డుతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న బన్నప్ప తనపై దాడిచేశాడంటూ సదరు హోంగార్డు ఫిర్యాదు చేశాడు. దీంతో మారేడ్‌పల్లి పోలీసులు ఆదివారం రాత్రి బన్నప్పను అదుపులోకి తీసుకుని రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచుకుని చితకబాదారు. సోమవారం మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో బన్నప్ప బంధువుల ప్రమేయంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. అయితే ఇంటికెళ్లాక బన్నప్ప శరీరంపై దెబ్బలు చూసిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. తీవ్రమైన దెబ్బలుగా గుర్తించిన ఆ వైద్యుడు... గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో వారు గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగానే.. ఆటోలోనే బన్నప్ప చనిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బన్నప్ప బంధుమిత్రులు, ఆ ప్రాంతం వారు మృతదేహాన్ని మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగారు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. వాహనాలకు నిప్పు పెట్టారు. బోనాల బందోబస్తు కారణంగా పోలీస్‌స్టేషన్‌లో నలుగురైదురుగు సిబ్బంది మాత్రమే ఉండడంతో వారిని నియంత్రించలేకపోయారు. దగ్గరలోనే నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయం ఉన్నప్పటికీ... విషయం తెలుసుకుని అదనపు పోలీసులు వచ్చేటప్పడికి దాడికి దిగినవారు పరారయ్యారు. ఈ ఘటనలో పోలీస్‌స్టేషన్‌లోని ఆయుధాలు కూడా పోయినట్లు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక కీలకమైన సీసీ కెమెరా పుటేజీల రికార్డింగ్‌కు సంబంధించిన బాక్స్‌ను సైతం ఆందోళనకారులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌పై దాడి నేపథ్యంలో మారేడ్‌పల్లి ప్రాంతంలో భారీస్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడినవారి కోసం గాలిస్తున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం: సీపీ మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి, నిందితుడి మృతి ఘటనలపై నిష్పక్షపాత విచారణ చేపడతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. సుమారు 200 మంది పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారన్నారు. కాగా అతిగా మద్యం సేవించడం వల్లే బన్నప్ప చనిపోయి ఉంటాడని నార్త్‌జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.