Responsibilities charge
-
డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సంఖ్యలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తాను పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది. ఆయనకు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (హెచ్ఓపీఎఫ్)గా బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న కొందరికి పోస్టింగులు ఇచ్చింది. డీజీపీగా పనిచేస్తూ ఎన్నికల సంఘం సస్పెన్షన్‌కు గురై వెయిటింగ్లో ఉన్న అంజనీకుమార్‌ను రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా బదిలీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా కూడా ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న మరో అధికారి సీవీ ఆనంద్‌ను ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. మొత్తం 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ, పోస్టింగులు ఇస్తూ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల్లోని సమస్యలపై దృష్టి పెడతానన్నారు. ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి వచ్చిన తాను విద్యాశాఖలో పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఉన్నత ప్రమాణాలు గల ప్రభుత్వ విద్య అవసరముందని, అందుకోసం సమాజం మేల్కొనాలని ఆయన పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలోని స్టేక్ హోల్డర్లందరినీ భాగస్వాములను చేసి ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తా నని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉద్యోగాలు పొందేందుకు కృషి చేస్తానని వెంకటేశం భరోసా ఇచ్చారు. -
ఆ రహదారిని ఆరు వరుసలకు విస్తరిస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని త్వరలోనే ఆరు వరుసలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడకు అతి తక్కువ సమయంలోనే చేరుకునే అవకాశముందని కోమటిరెడ్డి వెల్లడించారు. తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో, కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో భేటీ అయి పెండింగ్‌లో ఉన్న 14 జాతీయ రహదారుల ప్రతిపాదనలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఆదివారం ఆయన సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వారంలో మూడు రోజులు సచివాలయంలో, మూడు రోజులు జిల్లా పర్యటనలో ఉంటానన్నారు. రాష్ట్రంలోని రోడ్లను మెరుగుపరిచి దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. నాలుగు వరుసలకు విస్తరిస్తాం నల్గొండ నుంచి ముషంపల్లి మీదుగా ధర్మాపురం వరకు సింగిల్ రోడ్డుగా ఉండి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డును రూ.100 కోట్లతో నాలుగు వరుసలకు విస్తరిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లింగంపల్లి– దుగ్యాల రోడ్డును రూ.4.15 కోట్లతో మెరుగుపరుస్తామన్నారు. వారం రోజులు కూడా కాకముందే తమ ప్రభుత్వం రైతుబంధు నిధులు ఇవ్వటం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రత్యేక కార్యదర్శి విజేంద్రబోయి, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, న్యాక్ డీజీ భిక్షపతి, ఈఈ శశిధర్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన మంత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోమటిరెడ్డి ఆదివారం పరామర్శించారు. అనంతరం అక్కడే ఉన్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, హరీశ్‌రావును కలిసి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
సిద్ధూ బాధ్యతల స్వీకారానికి సీఎం అమరీందర్
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా హాజరుకానున్నారు. సిద్దూతోపాటు రాష్ట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇటీవల నియమితులైన కుల్జీత్ సింగ్ నగ్రా, సంగత్ సింగ్ గిల్జియన్ గురువారం మొహాలీలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లి అమరీందర్‌ను ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేల తరఫున తమ ఆహ్వానానికి సీఎం అంగీకరించారని చెప్పారు. సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవు తారని వెల్లడించారు. ఇలా ఉండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం అమరీందర్ ఆహ్వానించారని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ట్విట్టర్లో పేర్కొన్నా రు. ఉదయం 10 గంటలకు పంజాబ్ భవన్లో టీ పార్టీ ఉంటుందనీ, అనంతరం అందరూ కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్లో జరిగే కొత్త పీసీసీ బృందం బాధ్యతల స్వీకార కార్య క్రమంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. -
బాధ్యతలు స్వీకరించిన రాజపక్స
కొలంబో: శ్రీలంకలో వెంటవెంటనే చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య మాజీ అధ్యక్షు డు మహింద రాజపక్స సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని సెక్ర టేరియట్‌లో జరిగిన కార్యక్రమంలో రాజపక్స ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిరిసేన కేబినెట్లో మొత్తం 12 మంది మంత్రులతోపాటు సహాయ, డిప్యూటీ మంత్రు లు ప్రమాణం చేశారు. పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ ఆఫీసు వద్ద ఆదివా రం కాల్పుల్లో గాయపడిన మరొకరు సోమ వారం మరణించడంతో మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. దీనికి సంబంధించి మంత్రి రణతుంగను పోలీసులు అరెస్టు చేశారు. -
వారు కోరితే ప్రధానినవుతా
న్యూఢిల్లీ: ఒకవేళ మిత్రపక్షాలు కోరుకుంటే తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. ఎన్నికలు పూర్తయ్యాక అన్ని పక్షాలతో కలిసి చర్చించి ప్రధాని అభ్యర్థిపై తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్–2018(హెచ్‌టీఎల్‌ఎస్)లో ప్రసంగించిన రాహుల్ పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ‘తొలుత కలిసికట్టుగా పోటీచేసి బీజేపీని ఓడించాలనీ, అనంతరం అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని మేం(ప్రతిపక్షాలు) నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ మా మిత్రపక్షాలు కోరుకుంటే నేను ప్రధానిగా బాధ్యతలు తప్పకుండా చేపడతా. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసేందుకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నిరాకరించడంతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి విపక్షాలన్నీ ఏకమవుతాయి. మా అమ్మ సోనియాగాంధీ నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఓపిక తక్కువగా ఉండే నాకు ప్రశాంతంగా ఎలా ఉండాలో అమ్మ నేర్పించింది. కొన్నిసార్లు ‘అమ్మ నీకు ఓపిక మరీ ఎక్కువైంది’ అని నేను చెబుతుంటా’’ అని రాహుల్ చమత్కరించారు. మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారా? అన్న ప్రశ్నకు.. ‘ఎందుకులేరూ.. మా అమ్మ, సోదరి సహా నా జీవితంలో చాలామంది ఉన్నారు‘ అని రాహుల్ నవ్వుతూ జవాబిచ్చారు. సామాన్యులపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలని రాహుల్ ప్రధాని మోదీని కోరారు. -
బాధ్యతలను మరొకరికి అప్పగిస్తున్నా
కొట్టాయం/కొచ్చి: అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ పరిపాలన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ నెల 13వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ తాజాగా వెలుగు చూసింది. ‘నేను లేని సమయంలో మాన్సిగ్నోర్ మాధ్యూ కొక్కండమ్ ఈ డయోసిస్ పరిపాలన సజావుగా సాగేలా చూసుకుంటారు. దైవశక్తి జోక్యంతోనే ఈ అంశంలో సత్యం వెలుగు చూస్తుంది. నాకు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన ఆధారాల్లో పరస్పర విరుద్ధాంశాలున్నాయి. ఫలితం కోసం ఎదురు చూస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా కేరళ పోలీసులు నోటీసులిచ్చిన నేపథ్యంలో ఈ సర్క్యులర్ వెలువడింది. -
కొత్త బాధ్యతలు స్వీకరించిన సతీశ్ రెడ్డి
న్యూఢిల్లీ: డీఆర్డీఓ (రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ) చైర్మన్‌గా ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, తెలుగు తేజం జి.సతీశ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో డీఆర్డీఓ వెల్లడించింది. ఆయన రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగానికి కూడా కార్యదర్శిగా పనిచేస్తారు. 1985లో డీఆర్డీఓలో తన ప్రస్థానం ప్రారంభించిన సతీశ్‌రెడ్డి 1986–94 మధ్యకాలంలో క్షిపణి నేవిగేషన్(దిక్సూచి) వ్యవస్థలో అనేక మైలురాళ్లను ఆధిగమించారు. శాస్త్ర సలహాదారుగా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్, ఎవియానిక్స్ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇంతవరకూ ఆయన రక్షణ శాఖ మంత్రి శాస్త్ర సలహాదారుగా పనిచేశారు. -
ఒక్క సిక్కింకే వెళ్లలేదు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి నేడు ఏడాది పూర్తిచేసుకుంటున్న వెంకయ్యనాయుడు అరుదైన ఘనత సాధించారు. ఆయనకు ముందు పదేళ్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ తన పదవీకాలంలో 26 రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ వెంకయ్య ఏడాది కాలంలో ఒక్క సిక్కిం మినహా మిగిలిన 28 రాష్ట్రాల్లో పర్యటించారు. సిక్కిం పర్యటనకూ బయల్దేరిన వెంకయ్య ప్రతికూల వాతావరణం వల్ల అర్ధంతరంగా వెనుదిరిగారు. వెంకయ్య సిక్కిం మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించగా, అన్సారీ మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, అస్సాంలోనే పర్యటించారు. -
యూపీఎస్సీ చైర్మన్‌గా సక్సేనా
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తాత్కాలిక చైర్మన్‌గా అరవింద్ సక్సేనా నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆయన యూపీఎస్సీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ వినయ్ మిట్టల్ పదవీకాలం ఈనెల 19తో పూర్తికానుండటంతో ఆయన స్థానంలో సక్సేనా జూన్ 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ లేదా పదవీకాలం పూర్తయ్యే 2020, ఆగస్టు 7వరకూ సక్సేనా యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు’ అని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 1978 బ్యాచ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి అయిన సక్సేనా భారత నిఘాసంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)తో పాటు ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో పనిచేశారు. -
గుత్తా బాధ్యతల స్వీకారానికి సీఎం!
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా గుత్తా పేరును ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్‌ను ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. నేడో రేపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. అనంతరం జీవో జారీ చేసి అధికారికం గా గుత్తా పేరును ప్రభుత్వం ప్రకటించనుంది. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. గుత్తా చాంబర్‌ను బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో సిద్ధం చేశారు. అక్కడే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుఖేందర్‌రెడ్డి సోదరుడు, కుమారుడు వ్యవసాయ కమిషనరేట్‌కు వచ్చి కార్యాలయాన్ని, ఇతర వసతులను పరిశీలించారు. -
గంటా వర్గానికి ముకుతాడు
యనమలకు ఇన్చార్జి బాధ్యతలు మంత్రుల ఆదిపత్యానికి అడ్డుకట్ట యనమలతో అయ్యన్నకు సాన్నిహిత్యం గంటా వర్గానికి ప్రతికూల పరిణామం విశాఖపట్నం : గతేడాది అధికారుల బదిలీల సమయంలో జిల్లా మంత్రులపై వెల్లువెత్తున అవినీతి ఆరోపణలు రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి తలెత్తకుండా బదిలీల్లో స్థానిక మంత్రుల పెత్తనానికి చెక్ పెట్టేందుకు జిల్లాకో ఇన్చార్జి మంత్రిని నియమించింది. మన జిల్లాకు రాష్ర్ట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడ్ని నియమించడంతో జిల్లా మంత్రులకు చెక్ పడుతుందో లేక..ఆదిపత్యపోరు మరింత ఆజ్యం పోస్తుందోననే చర్చ పార్టీలో జరుగుతోంది. సాధారణంగా ఎమ్మెల్యేలకు కేటాయించే ఏసీడీపీ, ఎస్డీఎఫ్, సీడీపీ వంటి నిధులను ఖర్చు చేసే విషయంలో పెత్తనం జిల్లా ఇన్చార్జి సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహానగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీరం ఉంది. 134 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 62 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు లక్షా 20 వేల మంది మత్స్యకారులున్నారు. వీరిలో సుమారు 35వేలమంది పూర్తిగా చేపలవేటే జీవనోపాధిగా జీవిస్తున్నారు. 650 మెక నైజ్డ్ బోట్లు, 1500కు పైగా ఇంజన్ బోట్లు ఉన్నాయి. వందలాదిగా తెప్పలు,నావలు ఉన్నాయి. వేట నిషేధ సమయంలో మెకనైజ్డ్, ఇంజన్ బోట్లు లంగరేయాల్సిందే. మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది, ఇంజన్ బోటుపై ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మత్స్యకారులు పని చేస్తుంటారు. ఇక పరోక్షంగా మరో 10వేల నుంచి 15వేల మంది వరకు జీవనోపాధి పొందుతుంటారు. ప్రతీ ఏటా ఏప్రిల్-15వ తేదీ నుంచి మే-31వ తేదీ వరకు వేట నిషేధం అమలులో ఉండేది. గతేడాది వరకు 47రోజులు పాటు ఉండే వేటనిషేధ సమయాన్ని ఈ ఏడాది నుంచి ఏకంగా 61రోజులకు పెంచారు. గతంలో నిషేధ సమయంలో కుటుంబానికి 31 కిలోల బియ్యంతో సరిపెట్టేవారు. ఏటా నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుల జాబితాలు మారుతుంటాయి. కొన్ని సార్లు పెరుగుతుంటాయి.. మరి కొన్ని సార్లు తగ్గుతుంటాయి. అలాంటిది గతేడాది మంజూరైన సాయం ఈ ఏడాది పంపించడం.. ఈ ఏడాది సాయం వచ్చే ఏడాది పంచిపెట్టడం పరిపాటిగా మారిపోయింది. గతేడాది నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నేటికీ బియ్యం పంపిణీ జరగలేదు. ఇక ఈ ఏడాది నుంచి నిషేధసమయం పెంచడంతో బియ్యం స్థానంలో నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి రూ.2వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. నిషేధం అమలు లోకి వచ్చిసగం రోజులు గడిచినా అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. మెకనైజ్డ్, ఇంజన్ బోట్లపై ఆధారపడి జీవించే సుమారు ఐదువేల మంది మత్స్యకారులతో పాటు వీటిపై పరోక్షంగా ఆధారపడిజీవించే మరో 15వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా రూ.4కోట్లతో జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక లోటు కారణంగా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో సాపాటు లేక..సాయం లేక గంగపుత్రులు ఈ ఏడాది పస్తులతో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది.