![Ravi Gupta ssumes charge as elangana Director General of Police: Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/20/RAVI%20GUPTA.jpg.webp?itok=6qQ82pmH)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సంఖ్యలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తాను పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది. ఆయనకు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (హెచ్‌ఓపీఎఫ్)గా బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్‌లో ఉన్న కొందరికి పోస్టింగులు ఇచ్చింది. డీజీపీగా పనిచేస్తూ ఎన్నికల సంఘం సస్పెన్షన్‌కు గురై వెయిటింగ్‌లో ఉన్న అంజనీకుమార్‌ను రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా బదిలీ చేసింది.
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా కూడా ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్‌లో ఉన్న మరో అధికారి సీవీ ఆనంద్‌ను ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. మొత్తం 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ, పోస్టింగులు ఇస్తూ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment