Ravi Gupta
-
ఇకపై టీజీ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖ సిబ్బంది, అధికారులు ధరించే యూనిఫాంకు సంబంధించిన.. పోలీస్ టోపీ, బెల్ట్, బ్యాడ్జీలపై టీఎస్‌కు బదులుగా టీజీ అని ఉండేలా లోగోలో మార్పు చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాడ్జీలపై టీఎస్పీ స్థానంలో టీజీపీ, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, టీఎస్ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ, టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండేలా మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను ఆదేశించారు. -
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణ తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవా ణాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. మంగళవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వ ర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరో ధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. డ్రగ్స్ కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని బలహీనపరిచేందుకు దేశద్రోహులు డ్రగ్స్‌ను అస్త్రంగా ప్రయోగి స్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.బడ్జెట్ ఎంతైనా కేటాయిస్తాం..రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తామని భట్టి తెలిపారు. ఇప్పటికే అడిగినన్ని నిధులు ఇచ్చామని, రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినిపించకుండా చేయాల్సిన బాధ్యత నార్కోటిక్ విభాగానిదేనని పేర్కొన్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రజలు అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. కలసికట్టుగా తరిమేద్దాం: డీజీపీకలసికట్టుగా ఉండి రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను తరిమే యాలని డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు. పిల్లలు డ్రగ్స్‌కు బానిసలు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలేజీలు, స్కూళ్లను డ్రగ్ ఫ్రీ ప్రదేశాలుగా మలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే విద్యార్థుల జీవితాలతో పాటు వారి కలలు, కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అవుతాయని హెచ్చరించారు. చేయూతనివ్వాలి: హైదరాబాద్ సీపీడ్రగ్స్కు బానిసలైన వారిని చైతన్యపరచి, వారికి చేయూతనివ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. యువతను లక్ష్యంగా చేసుకుని దేశద్రోహులు డ్రగ్స్ కుట్ర పన్నుతున్నారని చెప్పారు. వారి ఉచ్చులో పడి యువత మత్తుకు బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు రూపొందించిన పాటను సీఎస్ శాంతికుమారితో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కోసం షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. నెక్లెస్ రోడ్డుపై విద్యార్థుల ర్యాలీని భట్టి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పాల్గొన్నారు.డ్రగ్స్‌పై సమాజాన్ని మేల్కొలుపుదాంమంత్రి పొన్నం ప్రభాకర్బంజారాహిల్స్ (హైదరాబాద్): యువ తను, విద్యా ర్థులను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రజా నాట్యమండలి కళారూ పాల ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. ‘డ్రగ్స్‌ను నిర్మూలి ద్దాం–సమాజాన్ని మేల్కొల్పుదాం’పేరిట చేపట్టే కళాయాత్ర లోగోను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ బారి నుంచి యువతను మేల్కొల్పి వారిని చక్కటి బాట పట్టించేందుకు చేప ట్టిన కళాయాత్ర విజయవంతంగా కొనసాగా లని ఆకాంక్షించారు. ప్రభుత్వం డ్రగ్స్‌ను ఎంత కట్టడి చేసినా డ్రగ్స్ మాఫియా వివిధ రూపాల్లో వ్యాపా రం సాగిస్తూ చివరకు చిన్న పిల్లలు తినే చాక్లెట్స్‌లో డ్రగ్స్ కలిపి వ్యాపారం చేస్తూ వారి జీవి తాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేద న్నారు. ప్రజా నాట్య మండలి కళారూపాల ద్వారా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ఈ నెల 31 వరకు ఎగ్జిబిషన్స్, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కళా యాత్రతో వివిధ కార్యక్రమా లను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. సంఘం చైర్మన్‌గా మంత్రి పొన్నం ప్రభాకర్, చీప్ ప్యాట్ర న్స్‌గా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సినీ గేయ రచ యిత అశోక్‌తేజ, మాదాల రవి, గాంధీ హాస్పటల్ సూపరింటెండెట్ రాజారావు, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్, డాక్టర్ నీలిమ, డాక్టర్ జీఎన్రావులతో పాటు భారత్ ఇన్స్టి ట్యూట్స్ సీహెచ్.వేణుగోపాల్‌రెడ్డి, డీజీ నరసింహారావు, నాగటి మారన్న, మహరాజ్‌లను ప్రకటించారు. -
అవగాహన లేమితోనే రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: వాహనదారుల్లో అవగాహన లేమితోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగు తున్నాయని, అవగాహన పెంచే కార్యక్రమా లపై అధికారులు దృష్టి పెట్టాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత చనిపోతున్నందున ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ, రోడ్ ఇంజనీరింగ్ వ్యూహాలతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసంగా కేంద్ర రోడ్డు రవా ణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించిన నేపథ్యంలో రోడ్డు భద్రత మాసం నిర్వహణపై రవిగుప్తా మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్‌లో రవాణాశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, రోడ్డు భద్రత, రైల్వేల విభాగపు అడిష నల్ డీజీపీ మహేష్‌భగవత్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఐజీ రంగనాథ్, రోడ్ సేఫ్టీ ఎస్పీ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లా డుతూ 2022లో తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా, దేశవ్యాప్తంగా 1,68,000 మంది మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లా డుతూ డ్రైవింగ్ చేయడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యన్నారు. ఈ ఉల్లంఘనలపై పోలీస్ ఉన్నతాధి కారులు దృష్టి పెట్టాలని సూచించారు. రహదా రులు ఉండే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని, పోలీస్ కార్యాలయంలో డిస్ట్రిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో, కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అవస రమైతే ఈ–చలాన్ నిధుల ద్వారా స్పీడ్ గన్స్ బ్రీత్ అనలైజర్స్ కొనుగోలు చేసే అవకాశాలను పరిశీ లించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి ‘గుడ్ సమారిటన్’ పేరిట సన్మా నం చేయాలని డీజీపీ అన్నారు. ఈ చర్యలు ఈ నెలకే పరిమితం కాకుండా దీర్ఘకాలంలోనూ అనుసరించాలని పోలీసు అధికారులకు డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. -
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ పీఎస్‌కు అవార్డు
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా 2023కుగాను ఎంపికైన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్)కు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించింది. శుక్రవారం జైపూర్‌లో జరిగిన అఖిలభారత డీజీపీ, ఐజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) బి. నాగేంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 17 వేల పోలీస్స్టేషన్ల నుంచి ప్రతిపాదనలు వెళ్లగా ఇందులో 74 పోలీస్ స్టేషన్లను కేంద్ర హోంశాఖ ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో కేంద్ర హోంశాఖ వెల్లడించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో రాజేంద్రనగర్ పీఎస్ తొలి స్థానంలో నిలవడం తెలిసిందే. స్టేషన్లో పోలీసులు చేపడుతున్న విధులు, కేసుల నమోదు, వాటి పరిష్కారంలో చూపుతున్న శ్రద్ధ, భార్యభర్తల గొడవల్లో కౌన్సెలింగ్, మహిళా భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని మృతదేహాల విషయంలో తీసుకుంటున్న చర్యలు.. స్టేషన్‌కు వచ్చిన వారిపట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు.. పీఎస్ పరిధిలో నమోదైన క్రైం రేట్.. దొంగతనాలు, దొంతనాల్లో రికవరీ శాతం వంటి అంశాల్లో ఈ స్టేషన్‌కు అవార్డు లభించింది. కాగా, దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్ ఎస్హెచ్ఓ బి. నాగేంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవి గుప్తా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అభినందనలు తెలియజేశారు. -
డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాల రవాణా, విక్ర య ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు. మత్తుపదార్థాలు అమ్మినా, కొన్నా, వాడినా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎంతటివారున్నా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల కట్టడి, సైబర్ నేరాల అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రానున్న ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదు 8.97 శాతం పెరిగినట్టు వెల్లడించారు. సైబర్ నేరాల నమోదు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ స్టేట్ పోలీస్ వార్షిక నివేదిక 2023ను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్, రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఐజీలు రమేశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో పోలీస్‌శాఖ భవిష్యత్ కార్యాచరణ అంశాలను డీజీపీ వివరించారు. డీజీపీ పేర్కొన్న కీలక అంశాలు: ♦ మత్తుపదార్థాల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉంటాం. ఒక్క డ్రగ్స్ కేసు నమోదైనా పీడీయాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ♦ పబ్బులు, క్లబ్బులు, ఫాంహౌస్‌లు, బార్లలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా అత్యంత కఠినచర్యలు తప్పవు. ♦ తల్లిదండ్రులు, విద్యా సంస్థలు సైతం మత్తుపదార్థాల కట్టడిలో పోలీస్‌శాఖతో కలిసి రావాలి. విద్యా సంస్థల్లోనూ యాంటీ డ్రగ్స్వాడకంపై దృష్టి పెట్టాలి. ♦ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్ నేరాలపై ఇప్పటివరకు 90 వేల ఫిర్యాదులు అందాయి. ♦ సైబర్‌నేరాలపై 14,271 ఎఫ్ఐఆర్ల నమోదుతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. ♦ రోడ్డు ప్రమాదాలు తగ్గిడంలో ఈ ఏడాది సఫలం అయ్యాం. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఎంతో మెరుగైంది. రాష్ట్రంలో ఇప్పుడు సరాసరి రెస్పాన్స్ టైం 7 నిమిషాలు. ♦ అతి త్వరలోనే 15,750 మంది వివిధ శాఖల్లోని కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రారంభిస్తాం. -
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ.. డీజీపీ రవిగుప్తా పిలుపు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ సరఫరాదారులు, వాడేవాళ్లకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్య పరిణామాల నడుమ.. ఈసీ ఆదేశాలతో డీజీపీగా రవి గుప్తా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన పూర్తిస్థాయిలో కొనసాగించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపించింది. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాదకద్రవ్యాల విషయమై హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని.. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని కోరారాయన. Govt. of Telangana resolved to make Telangana, a drug-free State. Let’s all unite to drive away the drugs from the territory of our State. All drug peddlers and consumers are hereby warned in this regard. Stringent legal action would be initiated against the violators. Let’s… — DGP TELANGANA POLICE (@TelanganaDGP) December 20, 2023 -
48.47% పెరిగిన సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంతో పోలిస్తే సైబర్ నేరాల నమోదు 48.47 శాతం పెరిగినట్టు తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది. ఆర్థిక నేరాలు, మోసాలు సైతం పెరిగినట్టు క్రైమ్ ఇన్ తెలంగాణ–2022 పుస్తకం వెల్లడించింది. తెలంగాణ సీఐడీ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన క్రైమ్ ఇన్ తెలంగాణ–2022 పుస్తకాన్ని సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్‌తో కలిసి డీజీపీ రవిగుప్తా మంగళవారం డీజీపీ కార్యాలయంలో విడుదల చేశారు. 2021తో పోలిస్తే తెలంగాణలో 2022లో ఆర్థిక నేరాల్లో 41.37 శాతం పెరుగుదల నమోదైందనీ, అదేవిధంగా మోసాలకు సంబంధించిన కేసుల్లోనూ 43.3 శాతం పెరుగుదల ఉన్నట్టు పుస్తకంలో వెల్లడించారు. నేషనల్ క్రైమ్‌రికార్డ్స్‌బ్యూరో(ఎన్సీబీఆర్) తరహాలోనే రాష్ట్ర సీఐడీలోని స్టేట్‌క్రైమ్ రికార్డ్స్బ్యూరో(ఎస్సీఆర్బీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నేరాల నమోదు, నేరాల సరళిని తెలియజేసేలా పూర్తి వివరాలతో కూడిన ‘‘క్రైం ఇన్ తెలంగాణ–2022’’పుస్తకాన్ని రూపొందించారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఈ తరహాలో క్రైం ఇన్ తెలంగాణ పుస్తకాన్ని రూపొందించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 10.25 లక్షల సీసీటీవీ కెమెరాలు రాష్ట్రంలో సీసీటీవీ కెమెరాల సంఖ్య 10,25, 849కు చేరినట్టు క్రైం ఇన్ తెలంగాణ–2022 పుస్తకం వెల్లడించింది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 1,74,205 సీసీటీవీ కెమెరాలను కొత్తగా ఏర్పాటు చేశారు. కాగా 2022లో నమోదైన 18,234 కేసులను ఛేదించడంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీ కీలకంగా పనిచేసినట్టు పేర్కొంది. ఎన్సీఆర్బీ 2022 నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత భద్రమైన నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచినట్టు పుస్తకంలో పేర్కొన్నారు. భద్రమైన నగరాల్లో మొదటి స్థానంలో కోల్‌కతా, రెండో స్థానంలో పుణే నిలిచింది. కాగా, క్రైమ్ ఇన్ తెలంగాణ–2022 పుస్తకం రూపొందించడంలో కీలకంగా పనిచేసిన ఎస్సీఆర్బీ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు సీహెచ్ చెన్నయ్య, సర్దార్ సింగ్, ఇన్స్పెక్టర్లు ఎస్ శేఖర్‌రెడ్డి, ఎన్ నవీన్‌బాబు, హెడ్ కానిస్టేబుళ్లు పి కృష్ణకుమారి, ఎన్ హుస్సేన్‌లను డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ అభినందించారు. -
డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సంఖ్యలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తాను పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది. ఆయనకు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (హెచ్ఓపీఎఫ్)గా బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న కొందరికి పోస్టింగులు ఇచ్చింది. డీజీపీగా పనిచేస్తూ ఎన్నికల సంఘం సస్పెన్షన్‌కు గురై వెయిటింగ్లో ఉన్న అంజనీకుమార్‌ను రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా బదిలీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా కూడా ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న మరో అధికారి సీవీ ఆనంద్‌ను ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. మొత్తం 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ, పోస్టింగులు ఇస్తూ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. అలాగే, తెలంగాణ డీజీపీగా రవిగుప్తానే కొనసాగనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, మాజీ డీజీపీ అంజనీకుమార్ రోడ్ సేఫ్టీ డీజీగా బదిలీ అయ్యారు. తాజా బదిలీల ప్రకారం.. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏసీబీ డీజీగా బదిలీ రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ. అభిలాష్ బిస్తా అడిషనల్ డీజీగా తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ. సౌమ్య మిశ్రా జైళ్ళ శాఖ అడిషనల్ డీజీగా బదిలీ. ఉమెన్స్ సేఫ్టీలో ఉన్న షికా గోయల్ సీఐడీ అడిషనల్ డీజీగా బదిలీ. సీఐడీ చీఫ్‌గా ఉన్న మహేష్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా బదిలీ. ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనిల్ కుమార్‌ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీగా బదిలీ. సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఐజీపీ హోమ్ గార్డ్స్‌కు బదిలీ. కమలాసన్ రెడ్డి ప్రొహిబీషన్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా బదిలీ. -
Telangana: డీజీపీ రేసులో పోటాపోటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీస్ విభాగాధిపతిగా ఎవరు వస్తారన్న చర్చ పోలీస్ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కొత్త డీజీపీగా నియమించనుందనే విషయానికి మరో వారంలో తెరపడనుంది. హెచ్ఓపీఎఫ్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) డీజీపీ రేసులో ఏసీబీ డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో మాత్రం వీరి ముగ్గురితోపాటు మరో సీనియర్ ఐపీఎస్ రాజీవ్‌రతన్ సైతం ఉన్నట్టు సమాచారం. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు ప్రస్తుతం సీనియార్టీ ప్రకారం డీజీపీ ర్యాంకులో 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఉమేశ్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్, రవిగుప్తా ఉన్నారు. సీఐడీ డీజీగా పనిచేసిన మరో సీనియర్ ఐపీఎస్ గోవింద్‌సింగ్ గత నెలలో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్‌కు డీజీ ర్యాంకు దక్కనుంది. అయితే, అందరిలోకి సీనియర్ అయిన ఉమేశ్ షరాఫ్ పదవీ కాలం 2023 జూన్‌తో ముగియనుంది. కేవలం ఆరు నెలల కాలమే ఉన్నందున ఆయనకు అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు పోలీస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన వారికి డీజీపీగా పదోన్నతి లభించింది. తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి విషయంలోనూ ఇదే మాదిరి జరిగింది. వారిద్దరు సైతం హైదరాబాద్ సీపీగా పనిచేస్తూ డీజీపీగా పదోన్నతి పొందారు. ఆ లెక్కన డీజీపీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో అంజనీకుమార్ గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేయగా, సీవీ ఆనంద్ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. ఎక్స్‌కేడర్ కోటాలో సీవీ ఆనంద్‌కు పదోన్నతి? సీఐడీ డీజీగా పనిచేసి ఇటీవల రిటైరైన గోవింద్ సింగ్ స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్‌కు డీజీ ర్యాంకులో పదోన్నతి దక్కింది. అయితే ప్రభుత్వం ఎక్స్‌కేడర్ కోటా కింద ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించవచ్చు. అలా సీవీ ఆనంద్ అడిషనల్ డీజీ ర్యాంకు నుంచి డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందుతారు. లేదంటే ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న మహేందర్‌రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌కు డీజీ హోదా దక్కే అవకాశముంది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రవిగుప్తా పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని అదనపు డీజీపీ ర్యాంకులో ఉన్న వారిని సైతం డీజీపీ పోస్టులో నియమించే వెసులుబాటు ఉంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ (ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్ డీజీ) సైతం డీజీపీ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమేశ్ షరాఫ్ (1989), అంజనీకుమార్ (1990), రవిగుప్తా (1990), రాజీవ్ రతన్ (1991), సీవీ ఆనంద్ (1991) పేర్లు యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీకి పంపినట్టు సమాచారం. ఇందులోంచి కేంద్రం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తే వారిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనున్నారు. లేదంటే ముందుగా ఒకరిని ఇంచార్జి డీజీపీగా నియమించి, తర్వాత పూర్తిస్థాయి డీజీపీని నియమించే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: అదే జరిగితే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కోల్పోక తప్పదా?!) -
పోలీస్ శాఖకు స్కోచ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్ అమలులో అన్ని రాష్ట్రాల కన్నా ముందుండటం, ఎప్పటికప్పుడు డాటా షేరింగ్‌లోనూ మొదటి స్థానంలో ఉండటంతో రాష్ట్ర పోలీస్ శాఖకు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమ్యూనికేషన్ అదనపు డీజీపీ రవిగుప్తా ఈ అవార్డును స్వీకరించారు. రవిగుప్తా, ఆయన బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. అవార్డు రావడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. రవిగుప్తాతో పాటు, ఆయన బృందాన్ని అభినందించారు. -
బడా వ్యాపారి కుటుంబం ఆత్మహత్య
గయ: బిహార్ లోని గయ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ధామి తోలా ప్రాంతానికి చెందిన బడా వ్యాపారవేత్త కుటుంబం అనుమానాస్పదంగా మరణించారు. గయా పట్టణంలో పప్పుధాన్యాల విక్రయించే అతిపెద్ద వ్యాపారి అయిన రవి గుప్తా భార్య, ఓ చిన్నారి సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం రవి గుప్తా అలియాస్ విక్కీ (36) పట్టణంలో పేరొందిన పెద్ద వ్యాపారవేత్తలో ఒకరిగా ఉన్నారు. ఏమైందో, ఏమో తెలియదు గానీ , అతని భార్య నిసి దేవి (30), వారి మూడు ఏళ్ల పాప వారి నివాసంలో అనూహ్యంగా మరణించారు. గురువారం ఉదయం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఇటీవల ఫిబ్రవరి 13 న రవి గుప్తా తల్లి గీతా దేవి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అతని సోదరి నిషా గుప్తా రవిదంపతులపై కేసు నమోదు చేశారు. వారి వేధింపుల కారణంగానే తన తల్లి ఆత్మహత్యకు కారణమని నిషా ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన ఈ జంట ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
అటాచ్మెంట్ అసమంజసం
పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ ముందు ‘జగతి’ న్యాయవాది వాదన సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన ఆస్తుల అటాచ్మెంట్ పూర్తిగా అసమంజసమని, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) వ్యవహరించిందని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవి గుప్తా వాదించారు. జగతి పబ్లికేషన్స్‌కి చెందిన రూ. 34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసుపై ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ (అడ్జుడికేటింగ్ అథారిటీ) మంగళవారం విచారణ జరిపింది. అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముకేశ్‌కుమార్ ముందు రవి గుప్తా వాదనను వినిపించారు. పీఎంఎల్ఏ నిబంధనలు ఏ సందర్భంలో ఆస్తుల్ని అటాచ్ చేయాలో స్పష్టంగా చెబుతున్నాయని, ‘క్విడ్ ప్రో కో’ అనేదే జరగని ఈ కేసులో ఆ నిబంధనలను ఉపయోగించడం సరికాదన్నారు. ‘సంస్థలో పెట్టుబడులను అక్రమాల తాలూకు సొమ్ముగా చెబుతున్న ఈడీ అదెలాగో మాత్రం చూపడం లేదు. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు తగిన కారణాలు చూపాలి. వారు పెట్టిన కేసు లోపభూయిష్టమైనందున అటాచ్మెంట్ ఉత్తర్వును కొట్టివేయాలి’ అని విన్నవించారు. పెట్టుబడులు పెట్టిన ముగ్గురు వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాన్నీ పొందలేదని కూడా రికార్డులు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. అలాంటప్పుడు వారి పెట్టుబడులను ‘క్విడ్ ప్రో కో’గా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. రవి గుప్తా వాదనల తర్వాత అథారిటీ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదావేసింది. -
‘క్విడ్ ప్రో కో’ లేనే లేదు
పీఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ ఎదుట ‘జగతి’ వాదనలు కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనాలూ పొందలేదు ఆ ముగ్గురూ ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలు చూపాలని ఈడీకి అథారిటీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల వెనుక ‘క్విడ్ ప్రో కో’ అనేది ఎక్కడా లేదని, వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలూ పొందలేదని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవిగుప్తా చెప్పారు. ఈ ముగ్గురూ అత్యంత సహజమైన వ్యాపార దృష్టితో లాభాలనాశించి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెడితే ఆ కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసును ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ (అడ్జుడికేటింగ్ అథారిటీ) శుక్రవారం విచారించింది. అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముకేశ్‌కుమార్ ఎదుట రవిగుప్తా దాదాపు మూడుగంటల పాటు వాదనలు వినిపించారు. ఆగస్టు 27న విచారణ సందర్భంగా అసంపూర్ణంగా ముగించిన వాదనను కొనసాగిస్తూ.. ఆ వ్యాపారవేత్తలు పెట్టిన పెట్టుబడులతో ప్రభుత్వానికి నష్టమే లేనప్పుడు అసలు ఇది పీఎంఎల్ఏ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నష్టం జరిగిందంటున్న ఈడీ అదెలా జరిగిందో వివరాలు మాత్రం చెప్పడం లేదని అథారిటీ దృష్టికి తీసుకువచ్చారు. జగతిలోకి వచ్చిన పెట్టుబడులు ముడుపులు అవునో కాదో ఈడీ ఆధారసహితంగా చూపకుండా, క్విడ్ ప్రో కోని నిరూపించకుండా ఇష్టానుసారం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు దిగడం అసమంజసమని అన్నారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి వాటికి తగ్గ షేర్లు పొందారు. వారు నష్టపోయిందే లేనప్పుడు ఇందులో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘పెట్టుబడులను పెట్టినవారిని సంస్థ మోసం చేస్తే అది తప్పవుతుంది కానీ అసలు పెట్టుబడుల్ని తీసుకోవడాన్నే నేరంగా పేర్కొనడం విడ్డూరం..’ అని అన్నారు. నిజానికి ఈ కేసులో ఇన్వెస్టర్లను మోసం చేయడమన్నదే జరగలేదంటూ, అలా చేసినట్టుగా వారెవరూ ఫిర్యాదు చేయని సంగతినీ ఆయన అథారిటీ దృష్టికి తీసుకొచ్చారు. కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి తొలుత ఈ కేసులో నిందితులుగా ఉన్నారని, తర్వాత వారు ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులుగా మారి స్టేట్మెంట్లు ఇచ్చారని రవిగుప్తా తెలిపారు. ఈ కేసు వ్యవహారాలు తలాతోకా లేకుండా నడుస్తున్నాయనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. సొమ్ముకు తగిన షేర్లు పొందారు... ‘‘కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి... ఈ ముగ్గురూ మోసపోయారా అంటే లేనే లేదు. పెట్టిన సొమ్ముకు తగ్గ షేర్లను పొందారు. తమ వ్యాపారాలను భిన్నరంగాల్లోకి విస్తరించుకునే ఉద్దేశంతో వారు స్వీయ నిర్ణయం మేరకే పెట్టుబడులు పెట్టారు. ‘జగతి’లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ముగ్గురికీ చేసిన వాగ్దానాలను అనంతర కాలంలో నెరవేర్చలేదని చెబుతున్నారు. అలాగైతే అది వారికి, సంస్థకు మధ్య వ్యవహారం. దీంట్లో పీఎంఎల్ఏకి సంబంధం ఏమిటి? వారు పెట్టుబడులు పెట్టింది ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగానేనని ఈడీ ఆరోపిస్తోంది. దీనికేమో ఆధారాలు చూపడం లేదు. ఎలా చూసినా ఇది క్విడ్‌ప్రో కో కేసు కానీ, సర్కార్‌కు నష్టం జరిగిన కేసు కానీ కానే కాదు..’’ అని రవిగుప్తా వాదించారు. ఈ వాదనలు ఆలకించిన అథారిటీ... ఈ ముగ్గురు ఇన్వెస్టర్లు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలను చూపాల్సిందిగా ఈడీని ఆదేశించింది. సీబీఐ పెట్టిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తును సాగించి అటాచ్మెంట్లకు దిగినందున ఆధారాల విషయంలో సీబీఐని సంప్రదించాలని సూచించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజు సదరు ఆధారాల వివరాలను తమ ముందుంచాలని ఈడీ తరఫు న్యాయవాది విపుల్కుమార్కు స్పష్టం చేసింది.