ఇకపై టీజీ పోలీస్‌.. | TG logo in place of TS In the police department | Sakshi
Sakshi News home page

ఇకపై టీజీ పోలీస్‌..

Published Sun, Nov 17 2024 4:58 AM | Last Updated on Sun, Nov 17 2024 4:58 AM

TG logo in place of TS In the police department

టోపీ, బెల్ట్, బ్యాడ్జీలపై టీఎస్‌ స్థానంలో టీజీ లోగో 

హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌శాఖ సిబ్బంది, అధికారులు ధరించే యూనిఫాంకు సంబంధించిన.. పోలీస్‌ టోపీ, బెల్ట్, బ్యాడ్జీలపై టీఎస్‌కు బదులుగా టీజీ అని ఉండేలా లోగోలో మార్పు చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 

బ్యాడ్జీలపై టీఎస్పీ స్థానంలో టీజీపీ, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ స్థానంలో తెలంగాణ పోలీస్, టీఎస్‌ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ, టీఎస్‌పీఎస్‌ స్థానంలో టీజీపీఎస్‌ ఉండేలా మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement