TG
-
ఇకపై టీజీ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖ సిబ్బంది, అధికారులు ధరించే యూనిఫాంకు సంబంధించిన.. పోలీస్ టోపీ, బెల్ట్, బ్యాడ్జీలపై టీఎస్‌కు బదులుగా టీజీ అని ఉండేలా లోగోలో మార్పు చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాడ్జీలపై టీఎస్పీ స్థానంలో టీజీపీ, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, టీఎస్ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ, టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండేలా మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను ఆదేశించారు. -
రైతుబంధు రాకపోతే..కాలర్ ఎగరేసి అడగండి
-
ఎక్కడికక్కడే అరెస్టులు.. టీజీపీఎస్సీ వద్ద హైటెన్షన్
హైదరాబాద్, సాక్షి: నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో నగరంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు. బీజేవైఎం, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. -
ఏబీవీపీ TGPSC ముట్టడి విఫలం.. నాంపల్లిలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: ఏబీవీపీ ముట్టడి ప్రయత్నంతో నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక వాతావరణం నెలకొంది. గ్రూప్ ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టుల డిమాండ్‌తో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు మంగళవారం ఉదయం టీజీపీఎస్సీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. అయితే.. ఒక్కసారిగా వాళ్లు కమిషన్ భవనం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తల్ని, విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 పిలవాలని, గ్రూప్ 2 లో పోస్టులు పెంచి, డిసెంబర్ లో గ్రూప్ టు పరీక్షలు నిర్వహించాలని, టీచర్ పోస్టుల్ని పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని టీజీపీఎస్సీని డిమాండ్ చేస్తోంది ఏబీవీపీ. -
ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 1గం. దాకా పరీక్ష జరిగింది. ఒక్క నిమిషం నిబంధనతో చాలామంది పరీక్ష రాలేకపోయారు. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఆ అభ్యర్థుల్ని నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు రద్దు అయిన ఈ పరీక్షను ఎట్టకేలకు ఇవాళ నిర్వహించారు. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఎంతమంది హాజరయ్యానే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జగిత్యాలలో అభ్యర్థుల ఆందోళనజగిత్యాల పట్టణంలో గ్రూప్-1 పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరగంట టైం ఉన్నా కూడా 5 నిమిషాలు మాత్రమే ఉందని ఇన్విజిలేటర్ చెప్పారని, టైం అయిపోయిందని చెప్పడంతో తొందరలో ఆన్సర్ చేశామని ఆవేదన చెందారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు అభ్యర్థులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గ్రూప్–1 ప్రిలిమ్స్ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. రెండుసార్లు రద్దు.. కమిషన్ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. -
TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం
-
వీడిన గందరగోళం.. సాయంత్రం కేబినెట్ భేటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రిమండలి సమావేశ నిర్వహణపై గందరగోళం వీడింది. ఇవాళ భేటీ ఉంటుందని రెండ్రోజుల కిందటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. సీఎం కార్యాలయం నుంచి మంత్రులకు ఇప్పటిదాకా అధికారిక సమాచారం వెళ్లకపోవడంతో ఉంటుందా? ఉండదా? అనే చర్చ నడిచింది. చివరకు సాయంత్రం భేటీ ఉంటుందని తెలుస్తోంది. కీలకమైన అంశాలపై తెలంగాణ మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగానే తెలంగాణ కేబినేట్ సమావేశం పై తర్జనభర్జన కొనసాగింది. మరోవైపు ఇప్పటికే కేబినేట్ భేటీలో చర్చించే అంశాలు ఇవేనంటూ సీఎంవో కొన్ని అంశాలను మీడియాకు విడుదల చేసింది. తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలురుణమాఫీ నిధుల సమీకరణ పై నిర్ణయంధాన్యం కొనుగోళ్లు , ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చరాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చమేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చకొత్త విద్యా సంవత్సరం లో చేపట్టవలసిన చర్యలపై చర్చకేబినెట్ భేటీ నిర్వహణ కోసం ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. అయితే అనుమతి దొరికిందా? లేదా? అనే స్పష్టత రాలేదు. ఈలోపే సాయంత్రం 4గం. కేబినెట్ భేటీ ఉంటుందని మీడియాకు సీఎంవో సమాచారం అందించింది. -
బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు
కవాడిగూడ: తెలంగాణ సంసృ్కతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ అంతర్జాతీయస్థా్ధయిలో గుర్తింపు పొందుతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలందరూ కులమతాలకు తావు లేకుండా పండుగ జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఎమ్యెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళలు సంప్రదాయాలను కొనసాగిస్తు భవిష్యత్ తరాలకు సంసృ్కతిని అందించటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప్పల శారద, నిర్మల, చాయదేవి, సరళదేవి, భారతి, కళావతి -
తెలంగాణ సర్కారీ కాలేజీల హవా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో వివిధ జిల్లాల్లో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అమ్మాయిల హవా కొనసాగింది. బాలురతో పోలిస్తే బాలికలు ఎప్పటిలాగానే ప్రతిభ కనబర్చారు. తెలంగాణలోని పది జిల్లాల ఫలితాలు ఇలా ఉన్నాయి: హైదరాబాద్- రంగారెడ్డి హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన గాయ్రతి జ్యోతి, కావ్య, భార్తవి, రవీంద్ర అత్యుత్తమ పలితాలు సాధించారు. మూసాపేట: ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల్లో కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు... కార్పొరేట్ కళాశాలలకు తీసిపోమని నిరూపించారు. గత ఏడాది 50.5 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి ఈ సంఖ్య 72.2కు పెరిగింది. సాధారణ కోర్సుల్లో 314 మంది విద్యార్థులకు 206 మంది ఉత్తీర్ణులయ్యారు. వృత్తి విద్యలో 104 మంది విద్యార్థులకు 96 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులో (ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్-పీఎస్టీటీ) గాయత్రి జ్యోతి 487 మార్కులు, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ (సీజీఏ)లో స్వాతి 484, అకౌంటింగ్, ట్యాక్సేషన్(ఏటీ)లో ఎ.కావ్య 482 మార్కులు సాధించారు. సీఈసీలో బి.రవీంద్ర 457, ఎంపీసీలో భార్గవి 429, బైపీసీలో పవిత్ర 388 మార్కులు సాధించారు. రాయదుర్గం: ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాల్లో పేద విద్యార్థినులు సత్తా చాటారు. గౌలిదొడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారు. క ళాశాల ఉత్తీర్ణత శాతం 75గా నమోదైంది. ఎంఈసీలో 25 మంది పరీక్షలు రాయగా... 17 మంది ఉత్తీర్ణులయ్యారు. సీఈసీలో 37 మందికి గాను 25 మంది పాసయ్యారు. గౌలిదొడ్డిలోని గురుకుల బాలికల కళాశాలలో ఎంఈసీ చదువుతున్న మాధురి మొత్తం 500 మార్కులకు గాను 483 మార్కులు సాధించింది. ఇదే కళాశాలకుచెందిన స్రవంతి మొత్తం 500 మార్కులకుగాను 479 సాధించింది. గౌలిదొడ్డిలోని టీఎస్‌డబ్ల్యూఆర్(ఐఐటీ-ఎల్టీసీడీ) కళాశాల విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో సత్తా చాటారు. ఈ కళాశాలకు చెందిన ఎంపీసీ విద్యార్థిఅఖిల్ ,లీల, ప్రేమ్‌సాగర్ పవిత్ర టాప్‌లో నిలిచారు. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈ ఏడాది 6.21 శాతం పెరిగింది. జిల్లాలో దేవరుప్పల ప్రభుత్వ జూనియర్ కళాశాల 92 శాతం ఉత్తీర్ణతతో టాప్‌గా నిలిచింది. తాడ్వారు, నెల్లికుదురు సంగెం తర్వాతి స్థానంలో నిలిచాయి.పర్కాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 43 మందికి నలుగురే ఉత్తీర్ణత సాధించి అట్టడుగున నిలిచారు. ప్రభుత్వ కళాశాలల్లోని ఒకేషనల్ కోర్సుల్లో 59.35 శాతం ఉత్తీర్ణులయ్యూరు. కాగా జిల్లాలోని 14 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో రెండు కళాశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఇందులో మడికొండ రెసిడెన్షియల్ కాలేజీలో 76 మందికి 76 మంది.. పర్వతగిరి రెసిడెన్షియల్కాలేజీలో 79 మందికి 79 మంది ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో 77 మందికి 24 మంది ఉత్తీర్ణత సాధించి చివరి స్థానంలో నిలిచారు. జిల్లాలో నాలుగు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీల్లో 75.67 శాతంఉత్తీర్ణత సాధించారు. ఇందులో ములుగు రోడ్డులోని ట్రైబల్ వెల్ఫేర్ ఎక్సెలెన్స్ జూనియర్ కాలేజీ టాప్లోనూ ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ చివరి స్థానంలో నిలిచాయి. మోడల్ స్కూళ్లలో నెల్లికుదురు మోడల్ స్కూల్ 98.46 శాతం ఉత్తీర్ణతతో టాప్లోను, వెంకటాపూర్ మండలంలోని జవహార్‌నగర్ మోడల్ స్కూల్ చివరి స్థానంలో నిలిచింది. జిల్లాలో ఆరు ఏయిడెడ్ జూని యర్ కాలేజీల్లో డోర్నకల్‌లోని డీ డీ కాలేజీలో 58.57 శా తం ఉత్తీర్ణత సా ధించి టాప్‌లో నిలిస్తే మహబూబియా పంజ తన్ ఏయిడెడ్ కాలేజీలో 100 మందికి ఐదుగురే ఉత్తీర్ణత సాధించారు. కరీంనగర్ జిల్లాలో 58 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో మొత్తం 6,866 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 3,227 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో 47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 66 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 64 మంది పాసై జిల్లాలో మొదటి స్థానంలో నిలిపారు. రెండవ స్థానాన్ని అదే మండలంలోని బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కైవసం చేసుకుంది. మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ మూడో స్థానం పొందింది. చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలోనే చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది స్థానంలో నిలిచిన జిల్లా బుధవారం వెలువరించిన ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జీజేసీ బనిగండ్లపాడు నూటికి నూరుశాతం ఫలితాలు సాధించింది. గుండాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 52 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఆదిలాబాద్ ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గురుకుల కళాశాలలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాలు గతేడాతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాయి. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇచ్చోడ, ఉట్నూర్, ఆసిఫాబాద్ బాలికల కళాశాలలు, ఆదిలాబాద్, నార్నూర్, లాల్టెక్డి బాలుర కళాశాలలు కలిపి మొత్తం ఆరు కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 779 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కాగా.. 681 మంది ఉత్తీర్ణత సాధించారు. 98 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇచ్చోడ బాలికల కళాశాల అత్యధికంగా 99.13 శాతం సాధించి మొదటి స్థానంలో నిలువగా.. రెండో స్థానంలో నార్నూర్ బాలుర కళాశాల 96.48 శాతం సాధించింది. ఆదిలాబాద్ బాలుర కళాశాల 68 శాతం సాధించి చివరి స్థానంలో నిలిచింది. నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలలో కూడా ఉత్తీర్ణత పెరిగింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలలలో 5,159 మంది విద్యార్థు లు పరీక్షలు రాయగా 2,743 మంది ఉత్తీర్ణులయ్యారు. మెదక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా 45 శాతం ఉత్తీర్ణ సాధించి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. క్రితం సారి కంటే ఈసారి ఒక శాతం ఫలితాలు క్షీణించాయి. కాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం రాష్ట స్థాయిలో జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లా స్థాయిలో తొగుట జూనియర్ కళాశాల వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలవగా నార్సింగ్ జూనియర్ కళాశాల కేవలం 14 శాతం ఉత్తీర్ణత సాధించి చివరి స్థానానికి పడిపోయింది. కోహీర్: ఇంటర్ ఫలితాల్లో కోహీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలో రెండో స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ జయరావు తెలిపారు. మహబూబ్ నగర్ మహబూబ్ నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 48శాతం ఉత్తీర్ణత శాతం సాధించి రాష్ట్రంలో అయిదవ స్థానంలో నిలిచాయి. ఉత్తీర్ణతా శాతంలో జిల్లాలో ప్రథమ స్థానంలో తాడూరు, రెండవ స్థానంలో పెబ్బేరు, కొల్లాపూర్ బాలికల జూనియర్ కళాశాల చివరి స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల శాతం ఘోరంగా దెబ్బతింది. గత కొన్నేళ్లుగా 90 శాతానికి పైగా ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచిన జీజేసీ నెమ్మికల్‌లో ఈ సంవత్సరం 13.77 శాతం ఫలితాలు సాధించింది. 94.53 శాతం ఉత్తీర్ణతతో జీజేసీ సంస్థాన్ నారాయణ్‌పూర్ ప్రథమ స్థానంలో ఉండగా, 87.90 శాతంతో జీజేసీ నడిగూడెం 2వ స్థానంలో నిలిచింది. 84.29 శాతం ఉత్తీర్ణతతో జీజేసీ విజయపురి నార్త్ (నాగార్జునసాగర్) తృతీయ స్థానం పొందింది. జిల్లాలోని నాలుగు ఎయిడెడ్ కాలేజీల్లో కేవలం 12.02 శాతం ఉత్తీర్ణతే నమోదయ్యింది. సూర్యాపేటలోని రాజారాం మెమోరియల్ జూనియర్ కాలేజీలో 70 మంది పరీక్ష రాయగా ఒకే ఒక్కడు ఉత్తీర్ణుడయ్యాడు. -
వాహన రిజిస్ట్రేషన్లకు బ్రేక్
కొత్త సిరీస్‌పై తొలగని ప్రతిష్టంభన మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు సాక్షి, సిటీబ్యూరో: కొత్త సిరీస్‌పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నగరంలో సోమవారం కూడా వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ వాహనాల నమోదు ప్రక్రియకు బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రానికి ‘టీజీ’ సిరీస్ ఉంటుందని మొదట భావించినా.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ‘టీజీ’కి బదులు ‘టీఎస్’ ఉండాలని సూచించడంతో రవాణా అధికారులు మరోసారి ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు. టీఎస్ సిరీస్‌ను కేటాయిస్తూ కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు వెలువడలేదు. దీంతో సోమవారం కొత్త వాహనాల నమోదుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. రాష్ట్రానికి సంబంధించిన సిరీస్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కోడ్లపైనా స్పష్టత రావలసి ఉంది. ఒకవేళ కేంద్రం నుంచి కొత్త సిరీస్‌పై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు వెలువడినా జిల్లా కోడ్లు, ప్రాంతీయ రవాణా కేంద్రాల నెంబర్ల రూపకల్పనకు కొంత సమయం పట్టొచ్చని రవాణా అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రానిదే తాము అడుగు ముందుకు వేయలేమని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రోజు వెయ్యికిపైగా కొత్త వాహనాలు గ్రేటర్ పరిధిలోని పది ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ వెయ్యికి పైగా కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటిలో 75 శాతం ద్విచక్ర వాహనాలే. కానీ రవాణాశాఖ సెంట్రల్ సర్వర్ నిలిపివేతతో గత నెల 31 నుంచే వాహనాల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సోమవారం రెండు రాష్ట్రాల్లోనూ సెంట్రల్ సర్వర్ పునరుద్ధరణ జరిగింది. లర్నింగ్ లెసైన్స్‌లు, శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల బదిలీ వంటి కార్యకలాపాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలకు సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ జరిగినా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిరీస్‌పై స్పష్టత లేకపోవడం వల్ల నగరంలో వాహనాల నమోదు శాశ్వత నమోదు ఆగిపోయింది. మరోవైపు రాష్ర్ట అవతరణ ఉత్సవాల దృష్ట్యా పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల సంఖ్యా పలుచబడింది. -
తెలంగాణ వాహనాలకు టీఎస్ సిరీస్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే కేంద్రం ‘టీజీ’ సిరీస్‌ను నోటిఫై చేసిన విషయం తెలిసిందే. కానీ టీఎస్ సిరీస్ కావాలని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరటంతో కేంద్రం మళ్లీ దాన్ని మార్చే పనిలో పడింది. తెలుగు అక్షరాల్లో ‘స’ అక్షరాన్ని శుభకరంగా భావించే కేసీఆర్ వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌లో కూడా ‘స’ ధ్వనించేలా ‘ఎస్’ అనే ఆంగ్ల అక్షరం ఉండాలని భావిం చినట్టు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. టీఎస్ పొడి అక్షరాలు ‘తెలంగాణ స్టేట్’ అనే పదానికి ప్రతిబింబంగా ఉంటున్నందున దాన్నే ఖాయం చేయాలని విజ్ఞప్తి చేయటంతో కేంద్రం కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం టీజీ సిరీస్‌ను నోటిఫై చేస్తున్నట్టు ఢిల్లీ నుంచి స్థానిక రవాణా శాఖాధికారులకు సమాచారం రావటంతో వారు ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ ఇప్పుడు సిరీస్ మార్పుపై వార్తలు వస్తుండటంతో స్పష్టత కోసం అధికారులు ఢిల్లీలోని అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించారు. దీంతో టీజీ ఉంటుందా టీఎస్ ఉంటుందా అన్న విషయంలో అయోమయం నెలకొందని రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు సాక్షితో చెప్పారు. శనివారం అర్ధరాత్రి వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, లేదంటే సోమవారం వస్తుందని తెలిపారు. జిల్లాల వారీగా నంబర్ సిరీస్‌ను ప్రస్తుతానికి పాతదే కొనసాగించే వీలుందన్నారు. -
‘తెలంగాణ’ సిరీస్ ఏమిటి?
వాహనాలకు ‘టీజీ’ కేటాయిస్తారా.. మారుతుందా? సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించాక వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటి సిరీస్‌ల విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవటం గందరగోళానికి దారితీస్తోంది. అపాయింటెడ్ డే (జూన్ 2)కు ఇంకా కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ కేంద్రం నుంచి రవాణా శాఖకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపై పలుమార్లు వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో అధికారులు చేతులెత్తేశారు. జూన్ రెండు నుంచి అధికారికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి దేనికవి పాలన ప్రారంభిస్తాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు రాష్ట్రాల పరిధిలోనే జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న ‘ఏపీ’ సిరీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణకు ‘టీజీ’ సిరీస్‌ను కేటాయించాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కేంద్రం దృష్టికి తెచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ సిరీస్ విషయంలో ఎలాంటి గందరగోళం లేకున్నా తెలంగాణకు సమస్యవచ్చిపడింది. అసలు టీజీ సిరీస్ ఉంటుందా, మరేదైనా కేటాయిస్తారా అన్న అనుమానాలూ అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల పేర్ల ఆధారంగా పరి శీలిస్తే తెలంగాణకు టీజీ సిరీసే ఉంటుందని అధికారులు అంచనా వేసుకోవటం మినహా కేంద్రం నుంచి స్పష్టత రాలేదు. టీజీ సిరీస్‌ను కేటాయించినా... జిల్లాల వారీగా ఏయే సంఖ్య ఉంటుందో కూడా తేలాల్సి ఉంది. ఏపీ సిరీస్‌లో ఆయా జిల్లాల ఆంగ్ల అక్షరక్రమం ప్రకారం నంబర్లను కేటాయించారు (ఉదా... ఖైరతాబాద్ 09, మెహిదీపట్నం 13, వరంగల్‌కు 36). తెలంగాణకు కొత్త సిరీస్‌లో భాగంగా అంకెలు మారతాయా, పాత అంకెలనే కొనసాగించాల్సి ఉంటుందా అన్నదీ తేలాల్సి ఉంది. అధికారులు మాత్రం ఆదిలాబాద్‌కు టీజీ 01తో ప్రారంభించి నంబర్లను ఉజ్జాయింపుగా సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం పది ఆర్టీఏ కార్యాలయాలున్నాయి. వీటికి ఏడు నంబర్లను కేటాయించారు. ఈలెక్కన టీజీ 01 నుంచి టీజీ-15 వరకు నంబర్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ కేంద్రం ఆదేశాలిస్తేగాని ఇందులో స్పష్టత రాదు. ఏపీ సిరీస్‌లో తెలంగాణ జిల్లాలకు ఉన్న నంబర్లనే కొనసాగించాలని పేర్కొంటే మాత్రం టీజీ సిరీస్‌తో ఆ పాత నంబర్లే కొనసాగుతాయి. తెలంగాణకు కొత్త నంబర్లు కేటాయిస్తే.. అందులోనూ మరో అయోమయం ఉండబోతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పది జిల్లాలను విభజించి 24కు పెంచాలని కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆ ప్రక్రియ జరిగితే మళ్లీ నంబర్లలో తేడాలొస్తాయి. ఇక ఏపీ సిరీస్‌తో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాత వాహనాల విషయం మరో చిక్కు ప్రశ్న. తెలంగాణలోని పాత వాహనాలన్నింటిని కూడా కొత్త సిరీస్‌లోకి మార్చాల్సి ఉంటుందా... లేదా అవి అలాగే ఏపీ సిరీస్‌తోనే కొనసాగుతాయా అన్నది తేలాల్సి ఉంది. లెసైన్సుదారులకు అందజేస్తున్న కార్డుల విషయంలోనూ గందరగోళం కొనసాగుతోంది. ఆ కార్డులపై రాష్ట్ర అధికారిక చిహ్నం ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నాన్ని ముద్రిస్తున్నారు. తె లంగాణ రాష్ట్రంలో కొత్త చిహ్నాన్ని ముద్రించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తెలంగాణకు అధికారిక చిహ్నమంటూ ఏదీ సిద్ధం కాలేదు. జూన్ రెండు నుంచి జారీ చేసే కార్డులపై ఏ చిహ్నం ముద్రించాలన్న అంశంపై గందరగోళం నెలకొంది. మరో పది రోజుల్లో అధికారికంగా తెలంగాణ ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో ఇన్ని అంశాలకు స్పష్టత రాకపోవటంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే ఢిల్లీని సంప్రదించినా ఫలితం రాకపోవటంతో వేచిచూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించి ఎలాంటి ముందస్తు ఏర్పాట్ల జోలికి వెళ్లటం లేదు. మరో నాలుగైదు రోజుల తర్వాత కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఫ్యాన్సీ నంబర్లకు నెలాఖరువరకు గడువు... తెలంగాణ జిల్లాల్లో ముందస్తుగా వాహనాల నంబర్లను రిజర్వ్ చేసుకున్నవారు ఈనెలాఖరులోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చే ఆదేశాల మేరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ సిరీస్, నంబర్లు మారే అవకాశం ఉన్నందున పాత సిరీస్ కేటాయింపు సాధ్యం కాదని పేర్కొంటున్నారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ నంబరు రిజర్వు చేసుకున్నాక పక్షం రోజుల్లో వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అపాయింటెడ్ డేకు పది రోజుల గడువు మాత్రమే ఉన్నందున, ఆ పక్షం రోజుల నిబంధన అమలు సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి రిజిస్ట్రేషన్ చేయించుకోని వారికి ... ఇప్పటికే చెల్లించిన ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తిరిగి చెల్లించమని స్పష్టం చేస్తున్నారు. -
టీజీ వెంకటేష్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు: కోట్ల
కర్నూలు : కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సొంతపార్టీ నేతలపైనే ధ్వజమెత్తారు. ఓవైపు మంత్రి పదవులు అనుభవిస్తూ మరోవైపుకాంగ్రెస్ పార్టీని నిందించటం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ద్రోహం చేసే మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని కోట్ల డిమాండ్ చేశారు. మంత్రి టీజీ వెంకటేష్‌పై స్పీకర్ ఫిర్యాదు చేస్తామని...ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే సీమాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం అందుతుందని ఆయన అన్నారు. -
రాయలసీమ హక్కులు తేల్చండి: టిజి
-
రాజీనామా వార్తలను ఖండించిన టీజీ, ఏరాసు