హైదరాబాద్, సాక్షి: నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో నగరంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు.
బీజేవైఎం, బీఆర్‌ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment