కర్నూలు : కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సొంతపార్టీ నేతలపైనే ధ్వజమెత్తారు. ఓవైపు మంత్రి పదవులు అనుభవిస్తూ మరోవైపుకాంగ్రెస్ పార్టీని నిందించటం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ద్రోహం చేసే మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని కోట్ల డిమాండ్ చేశారు.
మంత్రి టీజీ వెంకటేష్పై స్పీకర్ ఫిర్యాదు చేస్తామని...ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే సీమాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం అందుతుందని ఆయన అన్నారు.