
కర్నూలు: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి రావడం బాధాకరమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని చాలా ప్రయత్నించామని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
ఆ ప్రాజెక్టులు ఇస్తేనే టీడీపీలో చేరతామని చెప్పినట్లు వెల్లడించారు. కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని, చంద్రబాబుకు తప్పుడు జీవోలు ఇవ్వాల్సిన ఖర్మ పట్టలేదని వెనకేసుకొచ్చారు. తిరిగి అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని జోస్యం చెప్పారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment