
హైదరాబాద్, సాక్షి: ఏబీవీపీ ముట్టడి ప్రయత్నంతో నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక వాతావరణం నెలకొంది. గ్రూప్ ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టుల డిమాండ్‌తో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు మంగళవారం ఉదయం టీజీపీఎస్సీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. అయితే..
ఒక్కసారిగా వాళ్లు కమిషన్ భవనం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తల్ని, విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 పిలవాలని, గ్రూప్ 2 లో పోస్టులు పెంచి, డిసెంబర్ లో గ్రూప్ టు పరీక్షలు నిర్వహించాలని, టీచర్ పోస్టుల్ని పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని టీజీపీఎస్సీని డిమాండ్ చేస్తోంది ఏబీవీపీ.
Comments
Please login to add a commentAdd a comment