సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నా | ABVP leaders protests at cyberabad police commissionerate | Sakshi
Sakshi News home page

సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నా

Published Wed, Aug 5 2015 2:22 PM | Last Updated on Tue, Oct 2 2018 8:08 PM

ABVP leaders protests at cyberabad police commissionerate

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో అనుచిత వాఖ్యలకు సంబంధించిన వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం నగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలోని రెండు విద్యార్థి సంఘాల మధ్య రెండు రోజుల కిందట ఫేస్‌బుక్‌లో అనుచిత వాఖ్యలు పెట్టినందుకు వివాదం తలెత్తింది.

అదేరోజు ఈ విషయంపై సదరు విద్యార్థి సంఘాలు పరస్పరం దాడులకు దిగాయి. అయితే ఈ రోజు ఏబీవీపీ కార్యకర్తలంతా కలిసి తమ వాళ్లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట నిరసనకు దిగారు. దీంతో కమిషనరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement