డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం | The goal is a drug free state | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం

Published Wed, Jun 26 2024 4:25 AM | Last Updated on Wed, Jun 26 2024 4:25 AM

The goal is a drug free state

రాష్ట్రంలో డ్రగ్స్‌ కనిపించొద్దన్నదే సీఎం, మంత్రుల సంకల్పం

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 

అంతర్జాతీయ డ్రగ్స్‌ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

నెక్లెస్‌ రోడ్డులో అవగాహనా ర్యాలీ ప్రారంభించిన డిప్యూటీ సీఎం

డ్రగ్స్‌ నిర్మూలన మనందరి బాధ్యత: డీజీపీ రవిగుప్తా  

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ రహిత తెలంగాణ తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవా ణాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. మంగళవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వ ర్యంలో కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరో ధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. డ్రగ్స్‌ కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని బలహీనపరిచేందుకు దేశద్రోహులు డ్రగ్స్‌ను అస్త్రంగా ప్రయోగి స్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్‌ ఎంతైనా కేటాయిస్తాం..
రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరోకు ఎంత బడ్జెట్‌ అయినా కేటాయిస్తామని భట్టి  తెలిపారు. ఇప్పటికే అడిగినన్ని నిధులు ఇచ్చామని, రాష్ట్రంలో డ్రగ్స్‌ మాట వినిపించకుండా చేయాల్సిన బాధ్యత నార్కోటిక్‌ విభాగానిదేనని పేర్కొన్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రజలు అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. 

కలసికట్టుగా తరిమేద్దాం: డీజీపీ
కలసికట్టుగా ఉండి రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను తరిమే యాలని డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు. పిల్లలు డ్రగ్స్‌కు బానిసలు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలేజీలు, స్కూళ్లను డ్రగ్‌ ఫ్రీ ప్రదేశాలుగా మలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌ తీసుకుంటే విద్యార్థుల జీవితాలతో పాటు వారి కలలు, కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అవుతాయని హెచ్చరించారు. 

చేయూతనివ్వాలి: హైదరాబాద్‌ సీపీ
డ్రగ్స్‌కు బానిసలైన వారిని చైతన్యపరచి, వారికి చేయూతనివ్వాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. యువతను లక్ష్యంగా చేసుకుని దేశద్రోహులు డ్రగ్స్‌ కుట్ర పన్నుతున్నారని చెప్పారు. వారి ఉచ్చులో పడి యువత మత్తుకు బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు రూపొందించిన పాటను సీఎస్‌ శాంతికుమారితో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కోసం షార్ట్‌ఫిల్మ్‌ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.  నెక్లెస్‌ రోడ్డుపై విద్యార్థుల ర్యాలీని భట్టి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య  పాల్గొన్నారు.

డ్రగ్స్‌పై సమాజాన్ని మేల్కొలుపుదాం
మంత్రి పొన్నం ప్రభాకర్‌
బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): యువ తను, విద్యా ర్థులను పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రజా నాట్యమండలి కళారూ పాల ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. ‘డ్రగ్స్‌ను నిర్మూలి ద్దాం–సమాజాన్ని మేల్కొల్పుదాం’పేరిట చేపట్టే కళాయాత్ర లోగోను మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రగ్స్‌ బారి నుంచి యువతను మేల్కొల్పి వారిని చక్కటి బాట పట్టించేందుకు చేప ట్టిన కళాయాత్ర విజయవంతంగా కొనసాగా లని ఆకాంక్షించారు. 

ప్రభుత్వం డ్రగ్స్‌ను ఎంత కట్టడి చేసినా డ్రగ్స్‌ మాఫియా వివిధ రూపాల్లో వ్యాపా రం సాగిస్తూ చివరకు చిన్న పిల్లలు తినే చాక్లెట్స్‌లో డ్రగ్స్‌ కలిపి వ్యాపారం చేస్తూ వారి జీవి తాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేద న్నారు. ప్రజా నాట్య మండలి కళారూపాల ద్వారా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ఈ నెల 31 వరకు ఎగ్జిబిషన్స్, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు కళా యాత్రతో వివిధ కార్యక్రమా లను నిర్వహించనున్నట్లు తెలిపారు.

 కార్య క్రమంలో ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. సంఘం చైర్మన్‌గా మంత్రి పొన్నం ప్రభాకర్, చీప్‌ ప్యాట్ర న్స్‌గా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సినీ గేయ రచ యిత అశోక్‌తేజ, మాదాల రవి, గాంధీ హాస్పటల్‌ సూపరింటెండెట్‌ రాజారావు, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగేందర్, డాక్టర్‌ నీలిమ, డాక్టర్‌ జీఎన్‌రావులతో పాటు భారత్‌ ఇన్‌స్టి ట్యూట్స్‌ సీహెచ్‌.వేణుగోపాల్‌రెడ్డి, డీజీ నరసింహారావు, నాగటి మారన్న, మహరాజ్‌లను ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement