సాక్షి, హైదరాబాద్: వాహనదారుల్లో అవగాహన లేమితోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగు తున్నాయని, అవగాహన పెంచే కార్యక్రమా లపై అధికారులు దృష్టి పెట్టాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత చనిపోతున్నందున ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ, రోడ్ ఇంజనీరింగ్ వ్యూహాలతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసంగా కేంద్ర రోడ్డు రవా ణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించిన నేపథ్యంలో రోడ్డు భద్రత మాసం నిర్వహణపై రవిగుప్తా మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు ఇచ్చారు.
ఈ కాన్ఫరెన్స్‌లో రవాణాశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, రోడ్డు భద్రత, రైల్వేల విభాగపు అడిష నల్ డీజీపీ మహేష్‌భగవత్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఐజీ రంగనాథ్, రోడ్ సేఫ్టీ ఎస్పీ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లా డుతూ 2022లో తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా, దేశవ్యాప్తంగా 1,68,000 మంది మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లా డుతూ డ్రైవింగ్ చేయడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యన్నారు. ఈ ఉల్లంఘనలపై పోలీస్ ఉన్నతాధి కారులు దృష్టి పెట్టాలని సూచించారు.
రహదా రులు ఉండే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని, పోలీస్ కార్యాలయంలో డిస్ట్రిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో, కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అవస రమైతే ఈ–చలాన్ నిధుల ద్వారా స్పీడ్ గన్స్ బ్రీత్ అనలైజర్స్ కొనుగోలు చేసే అవకాశాలను పరిశీ లించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి ‘గుడ్ సమారిటన్’ పేరిట సన్మా నం చేయాలని డీజీపీ అన్నారు. ఈ చర్యలు ఈ నెలకే పరిమితం కాకుండా దీర్ఘకాలంలోనూ అనుసరించాలని పోలీసు అధికారులకు డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment