![ts State Police Department win Skoch Silver Award - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/26/SKOCH-POLICE-AWARD.jpg.webp?itok=JI9S7k2x)
అవార్డుతో డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీపీ రవిగుప్తా తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్) ప్రాజెక్ట్ అమలులో అన్ని రాష్ట్రాల కన్నా ముందుండటం, ఎప్పటికప్పుడు డాటా షేరింగ్‌లోనూ మొదటి స్థానంలో ఉండటంతో రాష్ట్ర పోలీస్ శాఖకు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమ్యూనికేషన్ అదనపు డీజీపీ రవిగుప్తా ఈ అవార్డును స్వీకరించారు. రవిగుప్తా, ఆయన బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. అవార్డు రావడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. రవిగుప్తాతో పాటు, ఆయన బృందాన్ని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment