skoch award
-
AP: గ్రామీణాభివృద్ధిశాఖకు మరో స్కోచ్ అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మరో స్కొచ్ అవార్డును సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటిని పెద్ద ఎత్తున నిల్వచేసుకునే ప్రక్రియలో భాగంగా అమృత్ సరోవర్ కార్యక్రమం అమలుకుగాను 2023 సంవత్సరానికి స్కోచ్ సిల్వర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఒక్కో జిల్లాలో 75 వంతున రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 1,950 చెరువులను ఈ కార్యక్రమంలో ఉపాధి పథకం ద్వారా నిరి్మంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,810 చెరువుల నిర్మాణం పూర్తయింది. ఈ నెలాఖరుకల్లా మిగిలిన 140 చెరువుల నిర్మాణం పూర్తవుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. స్కోచ్ సిల్వర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైన విషయాన్ని స్కోచ్ సంస్థ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలకు గత ఏడాది గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)తో పాటు వివిధ జిల్లాల డీఆర్డీఏలకు ఆరు స్కోచ్ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ -
ఏపీ సర్కార్‌కు అరుదైన అవార్డు.. అధికారులకు సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వానికి అరుదైన అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డును స్కోచ్ సంస్థ ప్రదానం చేసింది. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందించడం, ఆ రుణాలను సద్వినియోగం చేసుకోవటం.. సకాలంలో తిరిగి చెల్లించడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఈ సహాయ సహకారాలకు గాను ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్ధ గోల్డ్ అవార్డు వరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పొదుపు సంఘాల మహిళలకు సులభ విధానంలో రుణాలు అందేలా స్త్రీ నిధి సంస్థ కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అవార్డులను అధికారులు చూపించారు. ఈ సందర్భంగా అధికారులను సీఎం ప్రశంసించారు. చదవండి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
తెలంగాణకు ‘స్కోచ్ గోల్డ్ అవార్డు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కింది. ఇ–గవర్నెన్స్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం ఇ–ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్టుకు స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. ఈ అవార్డును న్యూఢిల్లీలోని ఇండియా హాబి టాట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ అందించారు. ఐటీఈ అండ్ సీ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ పెండ్యాల శ్రీనివాస్.. ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ చక్రధర్‌రెడ్డితో కలిసి ఈ అవార్డును అందుకున్నారు. -
గ్రామీణాభివృద్ధి శాఖకు స్కోచ్ పురస్కారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ‘స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్–2021’లో ఏపీ.. దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా ‘స్టార్ ఆఫ్ గవర్నెన్స్’ స్కోచ్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ ఎండీ దీపక్ దలాల్ ప్రకటించారు. జూన్ 18న ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో ఆయన తెలిపారు. స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడంపట్ల డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ అరుదైన గుర్తింపు లభించిందన్నారు. గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లడం వంటి అంశాలతో గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే ఈ స్కోచ్ అవార్డని అన్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. -
ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కిన మరో అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక ''స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2021''లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీనిలో భాగంగా ''స్టార్ ఆఫ్ గవర్నెన్స్-స్కోచ్ అవార్డు''కు ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ ప్రకటించారు. జూన్ 18వ తేదీన ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో ఆయన వెల్లడించారు. చదవండి: నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి! స్టార్ ఆఫ్ గవర్నెన్స్-స్కోచ్ అవార్డుకు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడం పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం (పిఆర్ అండ్ ఆర్డీ) బూడి ముత్యాలనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించిందని అన్నారు. గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్ళడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే తాజాగా స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఎంపిక అవ్వడమని అన్నారు. ఇందుకు గానూ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు. -
ఏపీకి ‘స్కోచ్’ అవార్డుల పంట
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌కు స్కోచ్ అవార్డుల పంట పండింది. స్కోచ్ గ్రూప్ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో గురువారం ప్రకటించిన అవార్డుల్లో అత్యధిక అవార్డులు ఏపీని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేటగిరిల్లో 5 గోల్డ్, 5 సిల్వర్ స్కోచ్ మెడల్స్ రాష్ట్రానికి దక్కాయి. ఢిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వెబినార్‌లో స్కోచ్ గ్రూప్ ఎండీ గురుషరన్‌దంజల్ ఈ అవార్డులను ప్రకటించారు. సంక్షేమ పథకాలకు బంగారు స్కోచ్‌లు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాలకు గోల్డ్ స్కోచ్‌లు వరించాయి. అదే విధంగా మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మత్స్యశాఖ ఇటీవల ప్రారంభించిన ‘ఫిష్ ఆంధ్రా’కు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ కేటగిరిలో గోల్డ్ స్కోచ్ దక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలనాటికి డ్వాక్రా సంఘాలకున్న అప్పును వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అదేవిధంగా 45–60 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తోంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం కనీసం 30 శాతం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 70 ఆక్వా హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను తీసుకొస్తోంది. ప్రయోగాత్మకంగా పులివెందులలో ఆక్వాహబ్తో పాటు 100కు పైగా రిటైల్ అవుట్‌లెట్స్ ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకాన్ని అత్యంత సమర్ధవంతంగా అమలుచేస్తోన్న అనంతపురం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కింది. ఇక గిరిజన ప్రాంతాల్లో బలవర్ధకమైన వరి (రైస్ ఫోర్టిఫికేషన్) సాగు చేస్తోన్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ వరించింది. ఐదు విభాగాల్లో సిల్వర్ మెడల్స్ డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో గోల్డ్‌మెడల్ దక్కించుకున్న మత్స్యశాఖ ఈ–ఫిష్ విభాగంలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. ఈ–క్రాప్ తరహాలోనే ఆక్వా సాగును గుర్తించేందుకు తీసుకొచ్చిన ఈ–ఫిష్ యాప్‌తో పాటు పశువైద్యాన్ని పాడిరైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ తీసుకొచ్చిన పశుసంరక్షక్ యాప్‌కు సిల్వర్ స్కోచ్ అవార్డులు వరించాయి. ఆర్బీకేల ద్వారా సకాలంలో సబ్సిడీపై విత్తనాలు అందిస్తూ రైతుసంక్షేమం కోసం పాటు పడుతున్న ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సిల్వర్ స్కోచ్ దక్కింది. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను అత్యంత పారదర్శకంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి సిల్వర్ స్కోచ్ వరించింది. ఇక.. బయోవిలేజ్, నేచురల్ ఫార్మింగ్ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్ స్కోచ్ దక్కింది. ఈ అవార్డులను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌లతో పాటు విజయనగరం, అనంతపురం జిల్లా కలెక్టర్లు అందుకున్నారు. చదవండి: ('చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకో') -
ఆర్బీకేలకు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డు
సాక్షి, అమరావతి: సాగులో మెళకువలు, సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికైన రైతు భరోసా కేంద్రాలను గతేడాది మే 30న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన 10,725 ఆర్బీకేలు, 154 ఆర్బీకే హబ్‌ల ద్వారా గడచిన 11 నెలలుగా వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు సేవలందుతున్నాయి. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను స్కోచ్ సంస్థకు సమర్పించారు. ఇందులో భాగంగా మన రాష్ట్రం నుంచి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వాటి ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలు రైతులకు అందిస్తున్న సేవల వివరాలను వ్యవసాయ శాఖ సమర్పించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్బీకేలు అందిస్తున్న సేవలను గుర్తించిన స్కోచ్ సంస్థ వైఎస్సార్ ఆర్బీకేలకు బంగారు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని శనివారం ఆ సంస్థ వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించింది. త్వరలో ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ అందుకోనున్నారు. విత్తు నుంచి విపణి వరకు.. విత్తు నుంచి విపణి వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు ఉత్పాదక సేవలందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలు వ్యవసాయ, అనుబంధ రంగాలైన ఉద్యాన, పట్టు, పాడి, ఆక్వా రంగాల సుస్థిరాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. వన్‌స్టాప్ షాప్ కింద ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కియోస్‌్కల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతోపాటు ఆక్వా, పాడి రైతులకు అవసరమైన సీడ్, ఫీడ్ కూడా అందిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా పొలం బడులు, తోట బడులు, మత్స్య సాగుబడులు, పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తూ రైతులకు ఎప్పటికప్పుడు అవసరమైన శాస్త్ర, సాంకేతిక సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆర్బీకేల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా మాసపత్రికను తీసుకొస్తున్నారు. ఇటీవలే దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా ఆర్బీకే యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ నుంచి గ్రామ స్థాయిలోనే పంటల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ఆర్బీకే స్థాయిలో 2,587 గొడౌన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు అద్దెకు సాగు యంత్రాలను అందుబాటులో తీసుకొచ్చే లక్ష్యంతో 10,285 ఆర్బీకేల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు (యంత్ర సేవా కేంద్రాలు)తో పాటు 151 హైటెక్ హై వాల్యూ మెకనైజేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 11 వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను తీసుకొస్తున్నారు. అలాగే 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8,051 ఆటోమేటిక్ కలెక్షన్ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటికి అనుబంధంగా జనతా బజార్లు, కేటిల్ షెడ్స్, ఆక్వా ఇన్ఫ్రా ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా వ్యవసాయ అనుబంధ సేవలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. సాధారణంగా స్కోచ్ సంస్థ డిపార్టుమెంట్లకు మెరిట్ అవార్డులిస్తుంది. కానీ.. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రశంసలు జల్లు కురిపించడమే కాకుండా ఏకంగా గోల్డ్ మెడల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది సీఎం మానస పుత్రికైన రైతు భరోసా కేంద్రాలకు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు అన్నారు. -
వైఎస్ జగన్‌కు ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డు
సాక్షి, అమరావతి: పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు స్కోచ్ గ్రూపు ఎంపిక చేసింది. పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిగిన అధ్యయనంలో పాలనలో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తేలిందని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. మంగళవారం క్యాంపు క్యార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఆయన అందజేశారు. ఆదర్శంగా ఆర్బీకేలు.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్టు స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ముఖ్యమంత్రి జగన్‌ను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ముందుగానే ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడం ఆసక్తికర నమూనాగా నిలిచిందని వెల్లడించారు. దీనివల్ల రైతులకు భారీ ప్రయోజనం కలగడంతో పాటు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఆర్ధిక సాధికారతకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాటు జీవనోపాధికి చేయూ త, అనుసంధాన రుణాలు ఇవ్వడం ద్వారా మహిళ ల ఆర్ధిక సాధికారతకు దోహదం చేశారన్నా రు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుం దని తెలిపారు. దిశ, అభయ పథకాల ద్వారా మహిళల భద్రత, రక్షణకు చర్యలు తీసుకున్నారని, తద్వారా శాంతి భద్రతలు వెల్లివిరియడంతోపాటు మహిళల్లో భరోసా పెరిగి గణనీయమైన మార్పులు తెచ్చిందని తెలిపారు. కోవిడ్ నియంత్రణలో సమర్థంగా.. కోవిడ్–19 నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా స్పందించిన తీరు, తీసుకున్న చర్యలతో పాటు 123 ప్రాజెక్టులపై ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో మెరుగైన ఫలితాలు స్పష్టంగా కనిపించాయని స్కోచ్ గ్రూప్ చైర్మన్ వివరించారు. పాలనను పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు విప్లవాత్మక చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. వివిధ రంగాల్లో వినూత్న చర్యలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కు దక్కుతుందన్నారు. చదవండి: పల్లెపల్లెన 540 సేవలు ఉన్నత విద్యకు కొత్త రూపు: సీఎం జగన్ -
స్కాచ్ ‘సీఎం ఆఫ్ ది ఇయర్’గా వైఎస్ జగన్
-
పోలీస్ శాఖకు స్కోచ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్ అమలులో అన్ని రాష్ట్రాల కన్నా ముందుండటం, ఎప్పటికప్పుడు డాటా షేరింగ్‌లోనూ మొదటి స్థానంలో ఉండటంతో రాష్ట్ర పోలీస్ శాఖకు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమ్యూనికేషన్ అదనపు డీజీపీ రవిగుప్తా ఈ అవార్డును స్వీకరించారు. రవిగుప్తా, ఆయన బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. అవార్డు రావడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. రవిగుప్తాతో పాటు, ఆయన బృందాన్ని అభినందించారు. -
మంత్రి కేటీఆర్ కు జాతీయ స్థాయి పురస్కారం
కేటీఆర్ కు చాలెంజర్ అప్ ద ఇయర్ అవార్డ్ వెంకయ్య నాయుడికి లైప్ టైం అచీవ్ మెంట్ అవార్డు హైదరాబాద్: టెక్నాలజీ, పరిపాలనా, పారదర్శకత అనే అంశాల అధారంగా గత రెండు సంవత్సరాలుగా వినూత్నమైన పద్దతుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయితీరాజ్, ఐటీ, మరియు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావుకి మరోసారి జాతీయ స్ధాయి గుర్తింపు లభించింది. పరిపాలన ద్వారా సమాజంలో అద్బుతమైన మార్పులను తీసుకొచ్చే వ్యక్తులకి లభించే స్కోచ్ అవార్డ్. ఈ సంవత్సరానికిగాను మంత్రి కె.తారక రామారావుకి ఛాలెంజర్ అప్ ద ఇయర్ అవార్డ్ దక్కింది. గత 14 ఏళ్లుగా దేశంలోని ప్రముఖులు గౌరవంగా భావించే ఈ అవార్డుకి ఎంపిక కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. టీహబ్ లాంటి వినూత్న ప్రాజెక్టులు చేపట్టి, టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పుల సాధన ద్వారా నూతన భారతదేశ అవిష్కరణ కోసం పనిచేస్తునందుకు ఈ అవార్డు ఇస్తున్నట్లు స్కోచ్ సంస్ద తెలిపింది. మార్చ్ 19న డీల్లీలో జరిగే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు స్వీకరించేందుకు రావాల్సిందిగా మంత్రికి అహ్వనం తెలిపింది. స్కోచ్ చాలెంజర్ అవార్డ్ ని స్టార్ట్ అప్ ఇండియా కేటగిరిలో ఇవ్వనున్నట్లు తెలిపింది. ఐటీ రంగంలో గత ఏడాదిన్నర కాలం నుంచి చేపట్టిన పలు కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్నామని, ముఖ్యంగా అంత్జాతీయ స్ధాయి ఇంక్యూబేటర్ టీహబ్ ని ఏర్పాటు చేశారన్నారు. ఈ టీహబ్ ద్వారా స్టార్ట్ అప్ లకి చేయూత అందించడంలో మంత్రి ముందు వరుసలో ఉన్నారన్నని అవార్డ్ కమీటీ తెలిపింది. ఈ దేశంలో స్టార్ట్ అప్స్, వాటికివ్వాల్సిన మద్దతు అనే అంశంపైన మంత్రి కేటీఆర్ ని కీనోట్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కోరారు. మంత్రి కేటీఆర్ తో పాటు కేంద్ర మంత్రికి వెంకయ్య నాయుడు కి లైప్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రకటించారు.