
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కింది. ఇ–గవర్నెన్స్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం ఇ–ప్రొక్యూర్‌మెంట్ ప్రాజెక్టుకు స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. ఈ అవార్డును న్యూఢిల్లీలోని ఇండియా హాబి టాట్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ అందించారు.
ఐటీఈ అండ్ సీ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ పెండ్యాల శ్రీనివాస్.. ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ చక్రధర్‌రెడ్డితో కలిసి ఈ అవార్డును అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment