
మహింద రాజపక్స
కొలంబో: శ్రీలంకలో వెంటవెంటనే చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య మాజీ అధ్యక్షు డు మహింద రాజపక్స సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని సెక్ర టేరియట్‌లో జరిగిన కార్యక్రమంలో రాజపక్స ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిరిసేన కేబినెట్‌లో మొత్తం 12 మంది మంత్రులతోపాటు సహాయ, డిప్యూటీ మంత్రు లు ప్రమాణం చేశారు. పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ ఆఫీసు వద్ద ఆదివా రం కాల్పుల్లో గాయపడిన మరొకరు సోమ వారం మరణించడంతో మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. దీనికి సంబంధించి మంత్రి రణతుంగను పోలీసులు అరెస్టు చేశారు.