
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా హాజరుకానున్నారు. సిద్దూతోపాటు రాష్ట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇటీవల నియమితులైన కుల్జీత్ సింగ్ నగ్రా, సంగత్ సింగ్ గిల్జియన్ గురువారం మొహాలీలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లి అమరీందర్‌ను ఆహ్వానించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేల తరఫున తమ ఆహ్వానానికి సీఎం అంగీకరించారని చెప్పారు. సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవు తారని వెల్లడించారు. ఇలా ఉండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం అమరీందర్ ఆహ్వానించారని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ట్విట్టర్‌లో పేర్కొన్నా రు. ఉదయం 10 గంటలకు పంజాబ్ భవన్‌లో టీ పార్టీ ఉంటుందనీ, అనంతరం అందరూ కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్‌లో జరిగే కొత్త పీసీసీ బృందం బాధ్యతల స్వీకార కార్య క్రమంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment