యూపీఎస్సీ చైర్మన్‌గా అల్కా సిరోహి | Alka Sirohi appointed UPSC chairman | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ చైర్మన్‌గా అల్కా సిరోహి

Published Mon, Sep 19 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

Alka Sirohi appointed UPSC chairman

న్యూఢిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) కొత్త చైర్మన్‌గా మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అల్కా సిరోహి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 3 వరకు ఆమె చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

2012 జనవరి నుంచి అల్కా కమిషన్‌ సభ్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్‌ దీపక్‌ గుప్తా తన పదవీ కాలం పూర్తవడంతో ఆమె స్థానంలో అల్కాను నియమించారు. కమిషన్‌లో సభ్యురాలిగా చేరకముందు అల్కా కేంద్ర వ్యక్తిగత, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement