AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే! | Minister Botsa Satyanarayana Release AP DSC Notification | Sakshi
Sakshi News home page

AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే!

Published Mon, Feb 12 2024 1:37 PM | Last Updated on Mon, Feb 12 2024 4:23 PM

Minister Botsa Satyanarayana Release AP DSC Notification - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్‌ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్‌ 42 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

నేటి(ఫిబ్రవరి 12) నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది.  మార్చి 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్‌.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండ సెషన్‌ నిర్వహించనున్నారు.

మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు, ఏప్రిల్‌ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 2న ఫైనల్‌ కీ.. ఏప్రిల్‌ ఏడున డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా 2018 సిలబస్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. cse.apgov.in వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచారు. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా..  రిజర్వ్‌ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచారు.


చదవండి: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement