మళ్లీ టెట్‌ నోటిఫికేషన్‌ | Again Tet notification in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మళ్లీ టెట్‌ నోటిఫికేషన్‌

Published Mon, Jul 1 2024 5:21 AM | Last Updated on Mon, Jul 1 2024 5:21 AM

Again Tet notification in Andhra Pradesh

నేడు విడుదల.. రేపు షెడ్యూల్‌

సాక్షి, అమరావతి:  ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ – టెట్‌)కు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ వంటి పూర్తి సమాచారంతో కూడిన షెడ్యూల్‌ మంగళవారం ప్రకటించనునున్నట్టు కమిషనర్‌ సురే‹Ùకుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్‌ నిర్వహిస్తునట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులకు కావాల్సిన పూర్తి సమాచారం, పరీక్షలు జరిగే తేదీలను త్వరలో https://cse.ap.gov.in/  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటుచేశామన్నారు.  

ఫిబ్రవరిలో ఒకసారి నిర్వహణ 
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతోపాటు అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఫిబ్రవరిలో టెట్‌–2024 నోటిఫికేషన్‌ ఇచి్చంది. దీంతో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు మొత్తం 2,67,789 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు సీబీటీ (ఆన్‌లైన్‌) విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహించగా 2,35,907 మంది (88.90 శాతం) హాజరయ్యారు.

అయితే, ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఫలితాలు వెల్లడించలేదు. జూన్‌ 25న ప్రకటించిన టెట్‌ ఫలితాల్లో 1,37,903 మంది (58.4 శాతం) మంది అర్హత సాధించారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల అర్హత పరీక్ష పేపర్‌–1ఏ (రెగ్యులర్‌)లో 75,142 మంది, పేపర్‌–1బీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో 790 మంది ఉత్తీర్ణులయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్ల అర్హత పరీక్ష అయిన పేపర్‌–2ఏ(రెగ్యులర్‌)లో 60,846 మంది, పేపర్‌–2బీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో 1,125 మంది విజయం సాధించారు. ఈ నేపథ్యంలో.. మరోసారి టెట్‌ (జూలై) నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  

గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ రద్దు 
ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇచి్చన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దుచేసింది. ఈ మేరకు ఆదివారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఒకట్రెండు రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు. అయితే, ఈ కొత్త డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు తక్కువగా ఉన్నాయని, కావాలనే ఈ పోస్టులు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని పలు జిల్లాల్లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement